అన్వేషించండి

Gudivada Amarnath: గాజువాకలో వైసీపీని గెలిపించి జగన్‌కు గిఫ్ట్ ఇద్దాం: మంత్రి అమర్నాథ్

Andhra Pradesh: గాజువాక నియోజకవర్గ వైసీపీ నేతలతో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. గతంలో తాను అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని జగన్ కు చెప్పానన్నారు.

AP Elections 2024 Gajuwaka: గాజువాక: అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకలో వైఎస్సార్ సీపీని గెలిపించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇద్దామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath). రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి స్థానిక టీ.ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. గడచిన 15 సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు అన్ని కలిసి పని చేస్తే వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. ప్రత్యేక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల కారణంగా పార్టీ అధినేత జగన్ తనకు ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించారని అమర్నాథ్ వెల్లడించారు. 

అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటా - గుడివాడ అమర్నాథ్ 
వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని, ఆయన గెలుపు కోసం అవసరమైతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని పార్టీ అధినేతలకు చెప్పినట్లు అమర్నాథ్ వెల్లడించారు. తన మీద నమ్మకం ఉంచి జగన్ తనను గాజువాక అభ్యర్థిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి సమక్షంలోనే తొలి సమావేశం ఏర్పాటు చేయాలని తాను అభ్యర్థన మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పదేళ్లుగా నాగిరెడ్డిని చూస్తున్నానని, ఆయన మనస్తత్వం తనకు బాగా తెలుసునన్నారు. గుడివాడ, తిప్పల కుటుంబాలకు 3 తరాల రాజకీయ అనుభవం ఉందన్నారు. తన తాత గుడివాడ అప్పన్న గెలుపు కోసం తిప్పల కుటుంబం ఏ విధంగా శ్రమించిందో తనకు తెలుసునన్నారు మంత్రి అమర్నాథ్. 

పవన్ కళ్యాణ్ పై నాగిరెడ్డి పోటీ చేసినప్పుడు మింది నుంచి మంచి మెజార్టీ తీసుకువచ్చి నాగిరెడ్డి విజయానికి సహకరించామని తెలిపారు. తనను నమ్ముకున్న వారికి వీలైనంతవరకు మంచి చేస్తామన్నారు. "గడిచిన 5 సంవత్సరాలలో అనకాపల్లిలో పార్టీ క్యాడర్ తో ఏ విధంగా పని చేశానో తెలుసుకోవాలి. వైసీపీ కోసం పనిచేసిన వారిని అనేక పదవుల్లో కూర్చోబెట్టానని’ 
అమర్నాథ్ చెప్పారు.

అమర్నాథ్ ను సీఎం వైఎస్ జగన్ నేరుగా గాజువాక అభ్యర్థిగా నియమించారని మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. వైసీపీ జెండా పట్టుకుని పనిచేసే కార్యకర్తలను అమర్నాథ్ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారికి నేను చేస్తారని గురుమూర్తి రెడ్డి చెప్పారు. వర్గ విభేదాలు మాని నాగిరెడ్డి నాయకత్వంలో అమర్నాథ్కు బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకువద్దామని చెప్పారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అమర్నాథ్ అని, ఆయనను గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు.

Gudivada Amarnath: గాజువాకలో వైసీపీని గెలిపించి జగన్‌కు గిఫ్ట్ ఇద్దాం: మంత్రి అమర్నాథ్
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదవాడికి న్యాయం జరగాలంటే వైసిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పార్టీ విజయం కోసమే పని చేయాలని, నాగిరెడ్డి సూచించారని దేవన్ రెడ్డి చెప్పారు. గాజువాక నియోజకవర్గం లో అమర్నాథ్ ఈజీగా నెగ్గుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
Mohammad Azharuddin: మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
PM Kisan Yojana : రైతులకు పీఎం కిసాన్ యోజన 21వ విడత కోసం ఎదురుచూపులు! ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడొచ్చంటే!
రైతులకు పీఎం కిసాన్ యోజన 21వ విడత కోసం ఎదురుచూపులు! ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడొచ్చంటే!
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
Mohammad Azharuddin: మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
PM Kisan Yojana : రైతులకు పీఎం కిసాన్ యోజన 21వ విడత కోసం ఎదురుచూపులు! ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడొచ్చంటే!
రైతులకు పీఎం కిసాన్ యోజన 21వ విడత కోసం ఎదురుచూపులు! ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడొచ్చంటే!
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
EPS Pension Eligibility : PFలో 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే చాలట.. పెన్షన్ కూడా వస్తుందట, రూల్స్ ఇవే
PFలో 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే చాలట.. పెన్షన్ కూడా వస్తుందట, రూల్స్ ఇవే
మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం!
మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం!
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఆస్తుల విలువ ఇదే.. ఒక్కో మూవీకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటుందంటే
మృణాల్ ఠాకూర్ ఆస్తుల విలువ ఇదే.. ఒక్కో మూవీకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటుందంటే
High Blood Pressure : బీపీ, గుండెను 7 రకాలుగా డ్యామేజ్ చేస్తుందట.. పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకండి
బీపీ, గుండెను 7 రకాలుగా డ్యామేజ్ చేస్తుందట.. పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకండి
Embed widget