అన్వేషించండి

Ministers Talks: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం - లిఖితపూర్వక హామీకి పట్టు, ప్రభుత్వం నుంచి కొరవడిన స్పష్టత

AP Employes News: ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. లిఖిత పూర్వక హామీకి వారు పట్టుబట్టగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు.

Employes Agitation: బకాయిలు తీర్చాలంటూ  ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీసు  ఇచ్చిన నేపథ్యంలో  ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చేపట్టిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. గతంలో సీఎం జగన్(Jagan) ఇచ్చిన హామీలు సహా ఇంతకు ముందు ఆందోళన సమయంలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీలపై శుక్రవారం ఉద్యోగ సంఘాలతో చర్చించింది. వీటిపై లిఖిత పూర్వక హామీకి ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అలాగే మద్యంతర భృతిపై కూడా ఎటూ తేల్చకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. 

ఉద్యోగుల ఉద్యమం

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో  గతంలో ఇచ్చిన హామీలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేశారు. సీపీఎస్(CPS) రద్దు సహా బకాయిలు చెల్లింపు, కొత్త పీఆర్సీ, ఐఆర్( I .R )ప్రకటన తదితర డిమాండ్లు నెరవేర్చాలంటూ  ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అందులో భాగంగానే  విడదల వారీగా నిరసనలు చేపట్టిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం స్పందించకుంటే మరోసారి ఛలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న చలో విజయవాడ (Vijayawada)కార్యక్రమం నిర్వహించి తీరుతామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ముందు ఉద్యోగులతో ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం గ్రహించింది. అందుకే ఉద్యోగ సంఘాలను  చర్చలకు అహ్వానించింది. సచివాలయంలో  మంత్రుల కమిటీ ఉద్యోగులతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఐఆర్ ప్రకటనపై ఉద్యోగులు  పట్టుబట్టగా... ప్రభుత్వం మరోసారి దాటవేత ధోరణి అవలంభించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.
మంత్రులు బొత్స(Botsa) సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల( Sajjala)రామకృష్ణారెడ్డితో పాటు సీనియర్ అధికారులు చర్చలో పాల్గొన్నారు. అటు ఉద్యోగ సంఘాల నుంచి బండి శ్రీనివాసరావు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి సహా పలువురు ఉద్యోగ సంఘం నేతలు చర్చలో పాల్గొన్నారు.

చర్చలు విఫలం
ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపైనే ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఎన్నికలు సమయం దగ్గరపడుతుండంతో  మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగులు పట్టుబట్టగా...ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఉద్యోగం సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు,  కొత్త పీఆర్సీ కొలువుదీరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటిలోగా ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు సర్దుబాటు చేయాలని ఉద్యోగులు కోరారు. గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉద్యోగుల ఉద్యమంతో.. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు, డీఏలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో మరోసారి ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఎన్నికల ముందు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే..ఈనెల 27న చలో విజయవాడ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీంతో మరోసారి ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు సైతం కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget