Relief to AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం రిలీఫ్ - ఐదేళ్ల జీతభత్యాలు రిలీజ్ !
Andhra Pradesh : రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సస్పెన్షన్ చెల్లదని కోర్టు చెప్పినందున ఆ కాలానికి జీత భత్యాలు చెల్లించాలని నిర్ణయించారు.

Government has given good news to retired IPS AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో 2 దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసిన జగన్ ప్రభుత్వం జీత, భత్యాలు నిరాకరించింది. ఇప్పుడు ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఏబీవీ సస్పెన్షన్ వేటు వేశారు. కోర్టు ఉత్తర్వులతో సస్పెన్షన్ వేటు ఎత్తివేసినా మళ్లీ రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు మరోమారు సస్పెన్షన్ విధించారు. తనపై సస్పెన్షన్ వేటు అక్రమం అని ఆయన న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలో ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రబుత్వం సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంతమొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కొద్ది రోజులకిందట ఏబీవీపై నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది.
2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడానికి కారణం ఆయనేనని భావించిన వైఎస్ఆర్‌సీపీ .. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత కేసులు పెట్టి సస్పెండ్ చేశారు.
ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనల విరుద్దంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కోనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని వైసీహీ హయాంలో కేసులు పెట్టారు. కుమారుడి కంపెనీనీ అడ్డుపెట్టుకుని నిఘా పరికరాలు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని గత ప్రభుత్వం ఆరోపించిందది. ఆయన తనపై అన్ని అవాస్తవాలతో కేసులు పెట్టారని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలో ఓ సారి సస్పెన్షన్ ఎత్తి వేసి మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. చివరికి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో... రిటైర్మెంట్ కు ముందు ఒక్క రోజు ఆయనకు పోస్టింగ్ దక్కింది. అదే రోజు రిటైరయ్యారు.
అయితే సస్పెన్షన్ లో ఉన్న కాలానికి ఆయనకు జీతభత్యాలు అందలేదు. కోర్టు తీర్పు మేరకు తనకు జీతం ఇవ్వాలని అభ్యర్థనలు పెట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీపై గత ప్రభుత్వం రెండు సార్లు విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పుడు జీత భత్యాలు ఇచ్చి న్యాయం చేసింది.
Also Read: స్కూల్ టాయిలెట్‌లో మద్యం సీసాలు - సమాచారం ఇచ్చారని విద్యార్థులపై టీచర్ దాడి, కర్నూలు జిల్లాలో ఘటన




















