News
News
X

Ministers On Tapping : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - కోటంరెడ్డికి మంత్రుల కౌంటర్ !

కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని .. ఫోన్ రికార్డింగ్ చేశారని మాజీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో కుమ్మక్కయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

FOLLOW US: 
Share:

Ministers On Tapping :  ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూండటంతో సీనియర్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. పలువురు మాజీ మంత్రులు సీఎం జగన్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ట్యాపింగ్ అంశం పై కోటంరెడ్డికి మాజీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.. చంద్రబాబు మంత్రి పదవిని ఆఫర్ చేసి ఉంటారని  అందుకే కోటం రెడ్డి టీడీపీలో చేరతానని ప్రకటన చేసినట్లుగా ఉందని కొడాలి అనుమానం వ్యక్తం చేశారు.  కోటంరెడ్డికి మంత్రి  పదవి  ఇవ్వడం  సాధ్యం  కాదని  సీఎం  జగన్  చెప్పి   ఉండవచ్చని, అయితే కోటంరెడ్డి కన్నా  సీనియర్లు  చాలా  మంది ఉన్నారని నాని అన్నారు. మంత్రి  పదవి  ఆశించి   నా  దగ్గరకు  రావద్దని  జగన్  చెబుతున్నారని, ఎమ్మెల్యే  సీట్   ఇస్తా   పోటీ  చెయ్   అని  సీఎం  జగన్  స్పష్టంగా  చెబుతున్నారని చెప్పారు. 

సామాజిక  వర్గ  సమీకరణాలు  కూడా  ముఖ్యమని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి  ప్రసన్న  కుమార్  రెడ్డి  ఇలా  కొంత మంది  నేతలు  ఉన్నారని, బాలినేని  మంత్రి  పదవి   వదులు కున్న విషయాన్ని కొడాలి గుర్తు చేశారు. సీఎం  జగన్  ఫోన్ ట్యాపింగ్  చేసి   చెత్త  మాటలు  వినాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ  ప్రతిపక్షం లో ఉండగా  23  మంది  పకోడీలు  వెళ్లిపోయారు  ఏమయ్యిందని నాని ప్రశ్నించారు. ఎస్సి  ఎస్టీ  బిసి  లకు  ఎన్ని  పడవులు  వచ్చాయి... అన్ని  అగ్ర కులాలకు ఇస్తే  ఎలా అన్న విషయాన్ని జగన్ ఆలోచించారని చెప్పారు. ఉండే వాళ్ళు  ఉంటారు  పోయే  వాళ్ళు  పోతారని, చంద్రబాబు  గాలి  కబుర్లు  చెప్పారని ఓడించిన నేతలు ఇప్పుడు మరలా అక్కడికే వెళుతున్నారని వ్యాఖ్యానించారు.
 
ప్రతి   మనిషి  ఫోన్  లో  రికార్డింగ్  యాప్  ఉంటుందని చెప్పారు. ప్రతి  కాల్  రికార్డ్  చేసి  సర్క్యులేట్  చెయ్యచ్చు ని, సీఎం జగన్ పై  ఎబ్బెట్టు గా మాట్లాడారు  కాబట్టి  కాల్   రికార్డ్  పంపించారని పేర్ని నాని స్పష్టం చేశారు.  తాను కూడా ఎవరితో అలా  మాట్లాడితే  పంపిస్తారని వ్యాఖ్యానించారు. టాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, కేవలం బురద  వేయడానికి  ఏదైనా చెప్తారని అన్నారు. సానుభూతి  కోసం  మాట్లాడతున్నారని, ఫోన్  ట్యాపింగ్  జరిగితే  అప్పుడే  చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఆరు సార్లు  ఎమ్మెల్యేగా చేసినా  మంత్రి  పదవులు  లేవని, సామాజిక  వర్గ  కూర్పు లో  కొన్ని సార్లు  పదవులు  రావన్నారు. వైసీపీలో  జగన్  పై  అసంతృప్తి  ఉంటే, అది స్పష్టం చేసుకోవచ్చని చెప్పారు. జగన్  పార్టీ  పెట్టకపోతే  ఎవరైనా  ఎమ్మెల్యేలు  మంత్రులు  అవుతారా అని ఆయన ప్రశ్నించారు.  ట్యాపింగ్  పై  ఎక్కడైనా   ఫిర్యాదు చేస్కోవచ్చని సవాల్ చేశారు.  

ట్యాపింగ్ చేస్తే  భయపడాలని, టీడీపీ  నుంచి  పోటీ  చేస్తానని ఆయనే చెబుతున్నారు కాబట్టి..  ఆ విషయాలు అన్నీ కోటం రెడ్డికే తెలియాలన్నారు. న్యాయస్దానంలో  మాట్లాడిన  మాటలు  బయట ప్రచారం చేయటం సరైంది కాదని అన్నారు. అయితే న్యాయమూర్తి మాట్లాడిన మాటలు  బయటకు ఎలా   వస్తాయని ఆయన ప్రశ్నించారు. న్యాయస్దానం  విషయంలో  అందరూ  సైలెంట్  గా  ఉన్నారా  అని ప్రశ్నించారు. వీళ్లంతా.. పోటుగాళ్లా ఇప్పుడు  మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ట్యాపింగ్  చేసే  సాఫ్ట్ వేర్ లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Published at : 01 Feb 2023 06:54 PM (IST) Tags: AP Politics apupdates taping

సంబంధిత కథనాలు

Perni Nani On Chandrababu : చంద్రబాబు విజయ రహస్యం కొనడం, అమ్మడం- పేర్ని నాని సెటైర్లు

Perni Nani On Chandrababu : చంద్రబాబు విజయ రహస్యం కొనడం, అమ్మడం- పేర్ని నాని సెటైర్లు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

నెల్లూరు నుంచి ఇంకెవరు వస్తారు? లోకేష్‌తో గిరిధర్ రెడ్డి భేటీ

నెల్లూరు నుంచి ఇంకెవరు వస్తారు? లోకేష్‌తో గిరిధర్ రెడ్డి భేటీ

Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

టాప్ స్టోరీస్

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ