అన్వేషించండి

Sailajanath: ఐటీ కంపెనీలు ఏపీకి పంపించడం కాదు, కృష్ణా నీటి వాటా సంగతేంటో చెప్పండి, కేటీఆర్‌కు శైలజానాథ్ కౌంటర్

Sailajanath: ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు.

Sailajanath: ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు. కంపెనీలు పంపిస్తాం, స్థలాలు ఇప్పిస్తామని చెప్పడం కాదని, కృష్ణా నీటి వాటా సంగతి తేల్చాలని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామని కేటీఆర్ చులకన భావనతో మాట్లాడటం.. తమ మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రాయలసీమకు చావు దెబ్బలాంటిదని పేర్కొన్నారు. బీజేపీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల కోసం వాడుకుందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పంపిణీపై కొత్త నోటిఫికేషన్ ను బీజేపీ ఇచ్చిందని ఆరోపించారు. 

రాయలసీమకు శ్రీశైలం జలాలను ఇవ్వాలని, హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టులు మూతపడతాయని శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లడం కాదు.. రాష్ట్రానికి కావాల్సిన హక్కులను సాధించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అందరినీ కలుపుకుని పోయి నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. బీజేపీ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.

ఏపీకి ఐటీ కంపెనీల్ని రికమెండ్ చేస్తా- కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు పెట్టాలని ..  తాను రికమెండ్ చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.  వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్టువేర్ కంపెనీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని మంత్రి  వ్యాఖ్యానించారు.  రానున్న పదేళ్లలో హైదరాబాద్‌కు వరంగల్‌కు పెద్దగా తేడా ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఐటీ రంగంలో భవిష్యత్తు అంతా టైర్ 2 నగరాలదే అని.. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు.                          

ఏపీలోని పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. బెంగళూరులో ఉన్న 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు.. ఆంధ్రా, తెలంగాణ వాళ్లేనని అన్నారు. వాళ్లందరూ తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి రెడీగా ఉన్నారని.. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.వరంగల్ మాత్రమే కాకుండా ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలన్నారు కేటీఆర్. అక్కడ కూడా ఎన్నారైలు ఐటీ సంస్థలు పెట్టాలని కోరారు. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు. అధిక జనాభా నష్టం అని చెప్పారు కానీ అది అబద్ధమన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేటీఆర్ ఉద్దేశం ప్రకారం ఏపీకి అసలు పెట్టుబడులేమీ రావడం లేదు..  ఏదైనా కంపెనీల్ని తానే రికమెండ్ చేస్తానని అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటాపోటీగా ప్రయత్నించాయి. హీరో ఎలక్ట్రిక్ ప్లాంట్ తో పాటు కియా,  డిక్సన్, హెచ్‌సీఎల్ తో పాటు చంద్రబాబు సీఎంగగా ఉన్న సమయంలో అనేక పరిశ్రమలు ఏపీకి తరలి వచ్చాయి. శరవేగంగా ఉత్పత్తి ప్రారంభించాయి. విజయవాడ సమీపంలో అతి పెద్ద హెచ్సీఎల్ క్యాంపస్ ను నిర్మించారు. విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget