Andhra Pradesh News: ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త, ఫీజు రూ.1 మాత్రమే
Registration Fees For House | ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్న పేద, మధ్య తరగతి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1 చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP CM Chandrababu | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు శుభవార్త చెప్పింది. ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు విషయంలో వారికి భారీ ఊరట కలిగించింది. 50 చదరపు గజాల పరిమాణంలో గల ఇళ్ల నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1 మాత్రమే ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పేద మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజుతో వారికి భారీ ఊరట కలిగింది. గతంలో ఇందుకోసం రూ.3000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది.
సామాన్యులపై తగ్గిన భారం
ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్ ఫీజు విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీచేసింది, దాని ప్రకారం, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎవరైనా 50 చదరపు గజాల పరిమాణంలోపు ఇళ్లు నిర్మించుకోవాలంటే వారు ప్రస్తుతం ఇంటి నిర్మాణం డాక్యుమెంట్ ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లించేలా ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలపై 6 కోట్లకు పైగా తగ్గనున్న భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ (G+1) భవన నిర్మాణం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
గతంలో, ఏపీ ప్రభుత్వం ఈ పరిణామంలోపు ఇళ్ల నిర్మాణానికి 3,000 రూపాయల ఫీజు వసూలు చేసేది. కానీ, ఇప్పుడు ఈ మొత్తాన్ని కేవలం రూ.1కి తగ్గించి సామాన్య ప్రజలపై భారం తగ్గించింది కూటమి ప్రభుత్వం. ఇండ్ల నిర్మాణం విషయంలో ఇది వారికి ప్రయోజనకరంగా మారుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాలకు మూడు వేలు ఖర్చు తగ్గడం చిన్న విషయమేమీ కాదు.
డిజిటల్ చెల్లింపు సౌకర్యం
ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అందులోనూ మరింత సౌకర్యవంతంగా, ఒక్క రూపాయి ఫీజును కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి మరింత సమయాన్ని వృథా చేసే సమస్యకు చెక్ పెట్టింది సర్కార్.
ఈ ఫీజు తగ్గింపు వల్ల సామాన్య ప్రజలపై 6 కోట్ల రూపాయలకు పైగా భారం తగ్గుతుంది. సొంతింటి కలను సాకారం చేసుకునే వారికి జీ ప్లస్ 1 వరకు ప్రత్యేక అనుమతి అవసరం లేకుండా చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణం మరింత సులభంగా జరగుతుందని అధికారులు భావిస్తున్నారు.






















