By: ABP Desam | Updated at : 21 Jan 2022 04:39 PM (IST)
సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వివాదం పీట ముడిపోతోంది. రెండు వర్గాలు ఎవరికి వారు తాము సమస్య పరిష్కారం కోసం ఆప్షన్ ఉంచామంటూనే తాము చేయాల్సినవి చేసుకుంటూ పోతున్నాయి. దీంతో సంక్షోభం ముదురుతోంది. ఏపీ పాలన స్తంభించిపోయే పరిస్థితి వస్తోంది. తాజాగాఉద్యోగులు తమ కార్యాచరణ ప్రకటించారు. సమ్మె తేదీ వివరించారు. అయితే ఉద్యోగులకు నచ్చే చెబుతామంటూ ప్రభుత్వాన్ని కమిటీ వేసింది. అదే సమయంలో కొత్త పీఆర్సీని ఆమోదిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసేసుకున్నారు.
Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!
నచ్చే చెప్పేందుకు కమిటీ అంటూ పీఆర్సీకి కేబినెట్‌లో ఆమోదం !
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను నచ్చ చెబుతామంటూ ప్రకటించారు. అందు కోసం ప్రత్యేక కమిటీ నియమించింది. పేర్ని నాని, సజ్జల, బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు సీఎస్ సభ్యులుగా ఉంటారు. వీరు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతారని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో తమ వంతు కనీసం కొంత అయినా సిన్సియార్టీ ఉందని నిరూపించలేకపోయింది. అదే కేబినెట్ భేటీలో కొత్త పీఆర్సీకి ఆమోద ముద్ర వేసేశారు.
Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !
ఉద్యోగ సంఘాలకు చర్చలకు వస్తాయా !?
ఎలాంటి చర్చలయినా జీవోలను ఉపసంహరించుకున్న తర్వాతనే జరుపుతామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే జీవోలను ఉపసంహరించడం కాదు.. ఇప్పుడు కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసేసుకున్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు మరింత ఆగ్రహం చెందడం ఖాయం. ఇప్పటికే ఇక ఉన్నతాధికారులతో చర్చించే ప్రసక్తే లేదని.. నేరుగా సీఎంతోనే చర్చిస్తామని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసింది. ఆ కమిటీతో చర్చలు జరుపుతారాలేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్ర ఒత్తిడి !
ఉద్యోగ సంఘాల నేతలందరూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న వాళ్లే. స్థానిక ఎన్నికల సమయంలో ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా .. ప్రభుత్వానికి అనుకూలంగా వారు చేసిన స్టేట్‌మెంట్లు దానికి సాక్ష్యం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు తమ ప్రయోజనాల విషయంలో వారు కూడా ప్రభుత్వాన్ని సమర్థించలేకపోతున్నారు. నిజానికి ఉద్యోగసంఘ నేతలు పీఆర్సీకి అంగీకరించి చప్పట్లు కూడా కొట్టారు. కానీ జీతం తగ్గిపోతుందనితెలిసి ఉద్యోగులు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఉద్యమబాట పట్టక తప్పలేదు. ఇప్పుడు ఉద్యమం కూడా వారి చేతుల్లో లేదు. ఉద్యోగులు చెప్పినట్లుగా చేయాల్సిందే.
Also Read: కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !
సమ్మె జరిగితే ప్రభుత్వానికి తీవ్ర నష్టం !
పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీతం పెంచకపోయినా.. పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలంటున్నారు. కానీ అలా ఇచ్చే ప్రశ్నే లేదని.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిస్తామని ప్రభుత్వం తేల్చేసింది. రెండు వైపులా పట్టు విడుపులు లేవు. దీంతో సమ్మె అనివార్యమన్న పరిస్థితి ఏర్పడుతోంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!