News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?

సామాజిక పెన్షన్లకు నిధులు లేకపోవడంతో ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు మళ్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం తప్పుగా డెబిట్, క్రెడిట్ అయ్యాయని చెబుతోంది.

FOLLOW US: 
Share:

GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి ప్రభుత్వం డ‌బ్బులు డ్రా చేసుకోవడం ఎపీలో రాజ‌కీయ దుమారాన్ని రేపుతోంది. తమ జీపీఎఫ్ సొమ్ములను అక్రమంగా విత్ డ్రా చేశారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక పెన్షన్లకు నిధులు సర్దుబాటు కాకపోవడంతోనే వాటిని మళ్లించారన్న  ప్రచారం సెక్రటేరియట్‌లో జరుగుతోంది. 

చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

ఒక‌టొ తేదీన ఎపీ వ్యాప్తంగా పిన్ష‌న్ల పంపిణి చేయాల్సి ఉంది. పెన్ష‌న్ల పంపిణికి అవ‌స‌రం అయిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆ నిధుల‌ను అటు వైపుకు మ‌ళ్ళించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తి నెలా ఒక‌టొ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వృద్దాప్య‌,వితంత‌పు పించ‌న్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పంపిణి చేస్తుంది. ఇందుకు అవ‌స‌రం అయిన నిధులు  ముందుగానే ప్ర‌భుత్వం ఆయా శాఖ‌ల అధికారుల ఖాతాలకు జమ చేస్తుంది. వారు బ్యాంకుల నుంచి డ్రా చేసి వాలంటీర్లకు ఇస్తారు.  ఒకటో తేదీ తెల్ల‌వారు జాము నుండే పెన్ష‌న్ల పంపిణి జ‌రుగుతుంది. జీపీఎఫ్ ఖాతాల నుండి మ‌ళ్లించిన సొమ్మును పెన్ష‌న్ల కోస‌మే ప్ర‌భుత్వం వినియోగిస్తుంద‌ని చెబుతున్నారు.

తెనాలి సబ్ రిజిస్టర్ కు మొదటి రోజే షాక్, విద్యుత్ అధికారులు ఎంత పనిచేశారు?

అయితే చాలా చోట్ల  30వ తేదీ సాయంత్రానికి కూడ ఇంకా స్దానిక అధికారులకు నిధులు అందలేదని తెలుస్తోంది.  మ‌రో వైపున ఇప్ప‌టికే ఈ విష‌యం పై అటు ఉద్యోగ సంఘాలు,ఇటు రాజ‌కీయ పార్టిలు ప్ర‌భుత్వం పై మూకుమ్మ‌డి దాడికి దిగాయి.  ఉద్యోగ సంఘాలు కూడ ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యి నిదుల మ‌ళ్లింపు వ్య‌వ‌హ‌రం పై చ‌ర్చించాయి.దీంతో ప్ర‌భుత్వం కూడ ఈ విష‌యం పై ప్ర‌త్యేకంగా వివర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం పై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య వల్ల జీపీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్-డెబిట్ లావాదేవీలు జరిగాయన్న ప్రభుత్వం, డీఏ బకాయిల బిల్లులు ఆమోదం పొందకుండానే పొరపాటున జీపీఎఫ్ ఖాతాల్లో నిధులు జమ అయినట్లు  పేర్కొంది.

జీపీఎఫ్ ఖాతాల గందరగోళం పై  డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.బిల్లుల ఆమోదం పొందకుండా నిధులు జమయ్యాయి కాబట్టి.. ఆ నిధులను వెనక్కు తీసుకున్నట్టు స్పష్టం చేశారు.ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు పెండింగులో ఉన్నాయని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.త్వరలోనే పెండింగ్ డీఏలను చెల్లిస్తామని స‌ర్కార్ చేసిన ప్ర‌క‌ట‌న పై ఉద్యోగుల్లో మ‌రింత చ‌ర్చ మెద‌లైంది.

Published at : 30 Jun 2022 06:28 PM (IST) Tags: Diversion of GPF funds AP employee funds employee money to pensions

ఇవి కూడా చూడండి

Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?

Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?

KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ

Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
×