News
News
X

Tenali News : తెనాలి సబ్ రిజిస్టర్ కు మొదటి రోజే షాక్, విద్యుత్ అధికారులు ఎంత పనిచేశారు?

Tenali News : తెనాలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు కరెంట్ కట్ చేశారు విద్యుత్ అధికారులు. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు కనెక్షన్ తొలగించారు. దీంతో సెల్ ఫోన్ వెలుగులోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

FOLLOW US: 

Tenali News : గుంటూరు జిల్లా తెనాలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. బిల్ చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. లెక్చరర్స్ కాలనీలోని వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కరెంట్ కట్ చేశారు. కరెంటు బిల్లులు బకాయిలు పేరుకుపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే తీగలను పోల్ పైనుంచి  కరెంట్ అధికారులు తొలగించారు. దాదాపు మూడు గంటల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విద్యుత్ నిలిచిపోయింది. విద్యుత్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కరెంటు బిల్లులు చెల్లించారు. అంతకు ముందు కార్యాలయ సిబ్బంది సెల్ఫోన్ లైట్లలో విధులు నిర్వహిస్తుంచారు. ఇవాళే గుంటూరు నుంచి తెనాలి సబ్ రిజిస్టర్ రమాదేవి బదిలీపై వచ్చారు. ఛార్జ్ తీసుకోక ముందే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై ఆమె ఆసహనం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కాలేదని అధికారులు అంటున్నారు.  

మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని కొన్నిసార్లు ఎలక్ట్రిసిటీ బోర్డుల నుంచి మెసేజ్ లు వస్తుంటాయి. భారీగా వర్షం పడినప్పుడో లేకు ఏదైన విద్యుత్ పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి మెసేజ్ రావడం సహజం. పైగా ఈ మేసెజ్ ఎలక్ట్రిసిటీ బోర్డుల్లో మన ఫోన్ నెంబర్ రిజిస్ట్రర్ చేసుకుంటేనే మేసెజ్ వస్తుంటాయి. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చారు. నకిలీ మేసెజ్ లు పంపిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. 

ఫోన్ చేశారో ఖాతా ఖాళీ 

'డియర్‌ కస్టమర్‌ మీ ఇంటి విద్యుత్‌ సరఫరా ఇవాళ రాత్రి నిలిపివేస్తున్నాం. మీరు ఈ నెల కరెంట్ బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నాం. మీరు వెంటనే ఈ నెంబర్ ను సంప్రదించండి' ఓ మెసేజ్ వస్తుంది. ఇందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేయగానే విద్యుత్ అధికారి మాట్లాడినట్లు ఒకరు మీతో మాట్లాడతారు. వాళ్ల మాటలు నమ్మితే మీరు ఖాతా ఖాళీ అయినట్లే.   

విద్యుత్ శాఖ ఇలా మేసెజ్ లు పంపదు 

మీకు వచ్చిన మెసేజ్ లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేస్తే అచ్చం విద్యుత్ అధికారి మీతో మాట్లాడతారు. విద్యుత్ బిల్లు చెల్లించని కారణంగా కరెంట్ నిలిపివేస్తున్నామంటారు. బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఇంకా పెండింగ్ లో ఉందని మాకు సొమ్ము చేరలేదని చెబుతారు. ఇందుకోసం ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్‌ అవుతాయని నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి యాప్ డౌన్‌లోడ్‌ చేసి రూ.10 చెల్లిస్తే మీ ఖాతాలో నగదుకు రెక్కలొచ్చినట్లే. ఇలా చేస్తే కాసేపటికే మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్ డ్రా అయినట్లు మేసెజ్ వస్తుంది. మీ ఖాతాలో నగదు మాయం అవుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ మేసెజ్ లు విద్యుత్‌ శాఖ పంపదని అధికారులు తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

Published at : 30 Jun 2022 03:58 PM (IST) Tags: AP News Tenali sub registrar office tenali news current cut power bills pending

సంబంధిత కథనాలు

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?