(Source: ECI/ABP News/ABP Majha)
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
చంద్రబాబుపై పోటీ చేసే అభ్యర్థి పేరును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ పేరు విశాల్‌దేనా ?
Kuppam Vishal : కుప్పంలో చంద్రబాబునాయుడిపై తమిళ హీరో విశాల్ పోటీ చేయడం లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ రాజకీయాాలను ఒంటి చేత్తో శాసిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడి్యాలో.. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కుప్పంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా భరత్‌నే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడు భరత్‌ను ప్రస్తుతం నియోజకవర్గం ఇంచార్జిగా నియమించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. నియోజకవర్గంలో ఆయనే పార్టీ తరపున వ్యవహారాలు చక్క బెడుతున్నారు.
అవును బీజేపీలో చేరుతున్నాను- సస్పెన్ష్‌కు తెర దించిన కొండా విశ్వేశ్వరరెడ్డి
అయితే చంద్రబాబును ఎదుర్కోవడానికి భరత్ సరిపోడని.. ఆయనకు బదులుగా స్టార్ ఇమేజ్ ఉన్న వారిని తీసుకు రావాలని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోందని కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. భరత్‌కే టిక్కెట్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో భరత్ వర్గీయులకు టెన్షన్ తగ్గింది. తమిళ హీరో విశాల్ తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తే అయినా కుప్పానికి చెందిన వారు కాదు. అక్కడ కొన్ని గ్రానైట్ క్వారీలు వారికి ఉన్నాయని తెలుస్తోంది. పైగా తమిళ ఓటర్లు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారందర్నీ విశాల్ ఆకట్టుకుంటాడని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు అనుకున్నట్లుగా చెబుతున్నారు.
సీబీఐ అరెస్ట్ భయం - హైకోర్టులో వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్ !
అయితే భరత్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినందున ఈ సారి చంద్రబాబుపై కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచన వైఎస్ఆర్‌సీపీలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పలువురి పేర్లను పరిశీలిస్తున్నారని అందులో భాగంగా వివిధ రకాల కాంబినేషన్లపై వర్కవుట్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రచారాల వల్ల నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డి ఖండించారు కానీ.. నిజానికి అక్కడ అభ్యర్థి మార్పు ఖాయమన్న వాదన కూడా కొంత మంది వినిపిస్తున్నారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. ఈ విజయాలన్నింటి వెనుక పెద్దిరెడ్డి వ్యూహమే ఉంది. ఆయనే దగ్గరుండి విజయానికి బాటలు వేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే టిక్కెట్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ పెద్దలు సర్వేలు చేసి ఏం తేలుస్తారో .. ఎవరికి ఇస్తారో వారే అభ్యర్థి అవుతారన్న అభిప్రాయం ఉంది.