East Godavari: అమలాపురంలో నాదెండ్ల మనోహర్ పర్యటన... నీట మునిగిన వరి పొలాల పరిశీలన... జనసేన సమావేశంలో ఉద్రిక్తత
ఇటీవల వర్షాలకు గోదావరి జిల్లాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు వరి పొలాలు పూర్తిగా నేలకొరిగాయి. అమలాపురంలో నీట మునిగిన పొలాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. అమలాపురం రూరల్ మండలం సమనసలో వర్షాలకు నీట మునిగిన పొలాలను మనోహర్ పరిశీలించారు. ఉప్పలగుప్తం మండలంలో గుండెపోటుతో చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 50 వేల చెక్ అందించారు. అనంతరం అమలాపురంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఒకప్పుడు క్రాప్ హాలిడే ఎందుకు పాటించారో ఇప్పుడు తెలుస్తుందన్నారు. రోడ్లపై జనసేన శ్రమదానం చేస్తోంటే దేశం మొత్తం ఆశ్చర్యపోయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా రోడ్లు ఉన్నాయా అని చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లోకి వెళ్లకుండా సీఎం జగన్ కేవలం హెలికాప్టర్ లో నుంచి చూసి వెళ్లిపోయారని విమర్శించారు.
అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ @mnadendla గారు పరిశీలించి, రైతులతో మరియు రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. pic.twitter.com/X4pebWa2O6
— JanaSena Party (@JanaSenaParty) November 29, 2021
Also Read: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు
ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం
రాష్ట్రంలో ఉద్యోగుల కూడా డెడ్ లైన్ విధించి ఆందోళన సిద్ధం అవుతున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్థం అవుతుందని మనోహర్ అన్నారు. డిసెంబర్ 31లోగా రాష్ట్రంలో ప్రతి మండలం, గ్రామ స్థాయిలో కార్యవర్గాన్ని నియమిస్తామన్నారు. రాష్టాన్ని వైసీపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసిందని ఆరోపించారు.
Also Read: భారీ వర్షాల ఎఫెక్ట్.. నెల్లూరు-చెన్నై హైవేపై రాకపోకలకు అంతరాయం.. కి.మీ మేర నిలిచిన వాహనాలు
అమలాపురం నియోజకవర్గంలో నష్టపోయిన పంట వివరాలను శ్రీ @mnadendla గారికి వివరిస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు.
— JanaSena Party (@JanaSenaParty) November 29, 2021
Video Link: https://t.co/4pARD9C3rA
కార్యకర్తల వాగ్వాదం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జనసేన కార్యకర్తల్లో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ సమావేశానికి ముందు కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుని వాగ్వాదానికి దిగారు. సమావేశం అనంతరం కూడా తోపులాట జరిగింది. జిల్లా నాయకులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Also Read: విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !