(Source: ECI/ABP News/ABP Majha)
RGV Hotel: తూర్పుగోదావరి జిల్లాలో ఆర్జీవీ హోటల్... ఇచ్చట అన్నీ హాట్ గురూ..!
సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ ఆర్జీవీ పేరుతో తూర్పుగోదావరి జిల్లాలో ఓ హోటల్ ఉంది. ఆర్జీవీకి వీరాభిమానులైన ఓ ఫ్యామిలీ ఆయన పేరుతో హోటల్ నడుపుతున్నారు. ఈ హోటల్ అడుగడుగునా ఆర్జీవీ కనిపిస్తాడు.
ఆర్జీవీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చాలా అంటారు కానీ ఆర్జీవీ లాజిక్స్ అర్థం కాక అలా విమర్శిస్తారంటారు రామూయిజం ఫాలోవర్స్. ఏ కథనాన్నైనా తన దర్శకత్వ ప్రతిభతో రక్తి కట్టించగల నైపుణ్యుడు ఆర్జీవీ. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై వినూత్నంగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు సెన్షేనల్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ. ఆర్జీవీ ఏ సినిమా చేసినా.. ఏం మాట్లాడినా.. చివరకు చిన్న ట్వీట్ చేసినా సంచలనమే. ఆయన మాట్లాడేది కొందరికి నచ్చుతుంది. మరికొందరికి గిచ్చుతుంది. చివరకు ఏది ఏమైనా నేనింతే అంటారాయన. కానీ వెతికి చూస్తే నిజమే కదా. రామూ మాట్లాడిన రామూయిజం వాస్తవమే కదా అని మేధావులు సహితం ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. తనకు నచ్చిందే చేస్తాడు.. నచ్చకపోతే నా సినిమా ఎవరు మిమ్మల్ని చూడమన్నారు అంటాడు. ఈ వ్యక్తిత్వమే రామ్‌గోపాల్‌వర్మను ప్రత్యేకంగా నిలబెట్టింది. సెలబ్రిటీలకు మించి ఫ్యాన్స్‌ను కూడగట్టింది. సరిగ్గా రామ్‌గోపాల్‌వర్మ ఫార్ములానే వంటబట్టించుకున్న ఓ అభిమాని తన అభిమానానికి వ్యాపారం జోడించి సక్సెస్ అవుతున్నాడు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేసి గుర్తింపు పొందాడో తెలుసుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామం వెళ్లాల్సిందే.
ఆర్జీవీ పేరుతో హోటల్
అభిమానాన్ని అనేక రకాలుగా చాటుకుంటారు సెలబ్రిటీల అభిమానులు. కొందరు తమకు నచ్చిన హీరోకు ఫ్లెక్సీలు కడతారు. పాలాభిషేకాలు చేస్తారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్జీవీ వీరాభిమాని వెంకటరమణ తన అభిమాన డైరెక్టర్ పేరుతో ఓ హోటల్ పెట్టి స్థానికంగా ఫేమస్ అయ్యాడు. ఈ యువకుని తల్లి, సోదరుడు కూడా ఆర్జీవీ వీరాభిమానులే. ఆయన ఫిలాసఫీకి ఫిదా అయినవారే. జిల్లాలో ఓడలరేవు వైపుగా ఎవరైనా కొత్తవారు వెళ్తుంటే బెండమూర్లంక సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ రామ్‌గోపాల్‌వర్మ ఫొటోతో కనిపించే హోటల్ చూసి ఓ లుక్కేస్తారు. ఇదేదో బాగుందే ఓసారి చూద్దాం అని లోపలకు వెళ్తే అక్కడ అంతా ఆర్జీవీ ప్రపంచమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రామ్‌గోపాల్‌వర్మ ఫొటోలు, పోస్టర్లు, రామ్‌గోపాల్ వర్మ పలు సందర్భాల్లో పలు వేదికలపై మాట్లాడిన సంచలన డైలాగులు దర్శనమిస్తాయి.
Also Read: పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్..
ఫ్యామిలీ మొత్తం ఆర్జీవీ అభిమానులే
ఆర్జీవీ అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఆయన చెప్పిన మాటలు ఓసారి నిధానంగా ఆలోచిస్తే అక్షర సత్యాలు అంటారు వెంకట రమణ. అందుకే ఆయన అంటే పిచ్చి.. హోటల్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడే మా అన్న, నేను నిర్ణయించేసుకున్నాం.. హోటల్ అంటే పెడితే ఆ పేరు రామ్‌గోపాల్‌వర్మ పేరునే పెట్టాలని అన్నారు. ఇక ఈ యువకుని తల్లి కూడా ఆర్జీవీకు వీరాభిమానే. అసలు ఈమె నుంచే అభిమానం కుమారులకు వారసత్వంగా వచ్చిందట. శివ సినిమా చూసినప్పుడు ఎవరీ డైరెక్టర్ అనుకుందట. అప్పటికే సినిమాలపై అవగాహన ఉన్న ఈమెకు శివ సరికొత్త అనుభూతిని ఇవ్వడంతో ఆర్జీవీను ఆరాధించడం మొదలు పెట్టింది. అంతే ఆ అభిమానం మరింత పెద్దదై ఇప్పుడు తన ఇద్దరు కుమారుల కూడా ఆర్జీవీ వీరాభిమానులయ్యారు.
Also Read: చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !
ఆర్జీవీ చేతుల మీదుగా హోటల్ ప్రారంభించాలనే ఆకాంక్ష
రాబోయే రోజుల్లో కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా రాంగోపాల్ వర్మ హోటల్ పెట్టాలన్నది తన లక్ష్యంగా చెబుతున్నారు వెంకట రమణ. ఆర్జీవి అంటే వీరికి ఉన్న అభిమానం హోటల్లో ఒక్క దాని మీదే కాదు ఇంట్లోనూ, బైక్ పైన ఇలా ఎక్కడ చూసినా రాంగోపాల్ వర్మ ఫోటోలే కనిపిస్తాయి. హోటల్ వ్యాపారంలో బాగా స్థిరపడితే మంచి సిటీలో హోటల్ పెట్టి దాన్ని రామ్ గోపాల్ వర్మ చేతులమీదుగానే ప్రారంభించాలని తన ఆకాంక్ష అని ఈ యువకుడు చెప్తున్నాడు.
Also Read: తాగుబోతు మొగుణ్ని భరించలేక పుట్టింటికెళ్లిన భార్య.. అత్తపై కేసు పెట్టాలని సెల్‌టవర్ ఎక్కిన భర్త
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి