అన్వేషించండి

Drone: జనసేన కార్యాలయంపై డ్రోన్ వ్యవహారంలో కీలక మలుపు - అది ప్రభుత్వానిదేనని తేల్చిన పోలీసులు!

Andhra News: మంగళగిరిలోని జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్‌గా పోలీసులు గుర్తించారు.

Drone Fly On Janasena Office: మంగళగిరిలోని  (Mangalagiri) జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ డ్రోన్ ప్రభుత్వానిదేనని తేల్చారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్‌గా గుర్తించిన పోలీసులు.. సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తుండగా.. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.

మరోవైపు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భద్రతకు సంబంధించి ప్రతీ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumalarao) అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం పెట్రోల్ బంకును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మన్యంలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుబడిన ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని పేర్కొన్నారు. 'పోలీసుల సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ బంకుల్లో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుని పోలీస్ శాఖకు సహకరించాలి. గతం కంటే ఈసారి కోడి పందేలు ఎక్కువగా జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. పందేలకు సంబంధించిన కేసులైతే ఎక్కువగానే నమోదు చేశాం.' అని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది

కాగా, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై శనివారం డ్రోన్ ఎగిరింది. ఈ మేరకు పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సీఐ వినోద్ ఘటన జరిగిన రోజునే జనసేన కార్యాలయంలో సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. రెండ్రోజుల లోతైన దర్యాప్తు అనంతరం అది ప్రభుత్వానికి చెందిన డ్రోన్‌గా గుర్తించారు.

Also Read: RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget