AP DGP Comments : ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ - దిశయాప్ సమాచారం భద్రంగా ఉంటుందన్న డీజీపీ !
ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని డీజీపీ ప్రకటించారు. కొత్త హోంమంత్రి తానేటి వనితతో డీజీపీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ( Friendly Policing ) అమలు చేస్తామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ( AP DGP ) ప్రకటించారు. హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనితతో ( Taneti vanita ) డీజీపీతో పాటు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ఖచ్చితంగా అమలు చేస్తామని హోంమంత్రి వనితకు హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు ఖచ్చితత్వం ఉన్న కేసులు వస్తే వెంటనే పరిష్కరించే దిశగా పోలీసులు చూడాలని హోంమంత్రి ఈ సందర్భంగా డీజీపీకి సూచించారు. క్రైం రేటు తగ్గించడం, నాటుసారాను అరికట్టడంపై కూడా చర్చించారు. వైజాగ్ ప్రాంతంలో గంజాయి సాగు, దాడుల అంశం కూడా చర్చకు వచ్చిందని ఏపీ డీజీపీ తెలిపారు.
ఏపీ మినిస్టర్స్ శాఖల్లో మార్పు, చేర్పులు ! బొత్స, బుగ్గన మార్పు కోరుకుంటున్నారా ?
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ హెచ్చరించారు. నెల్లూరు కోర్టులో ( Nellore Court Theft ) జరిగిన దొంగతనంపైనా డీజీపీ స్పందించారు. దొంగతనం కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణలో లభ్యమైన ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నామని తెలిపారు. వాస్తవాలు విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుర్తు చేశారు. అలాగే అనంతపురంలో మంత్రి ఉషాశ్రీచరణ్ ( Usha Sri Charan ) ర్యాలీ కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో చికిత్సకు వెళ్తున్న ఓ చిన్నారి మరణించిందని వచ్చిన విమర్శలపైనా స్పందించారు. ఆ విషయంలో నిజం లేదన్నారు. మంత్రి ఉష శ్రీ చరణ్ ర్యాలీకి, చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి గంట తేడా ఉందని ఆ విషయం సీసీ టీవీ ఫుటేజీలో ఈ విషయం క్లియర్‌గా ఉందన్నారు.
ఎలాంటి విచారణకైనా సిద్ధమే- నెల్లూరు కోర్టులో దొంగతనం కేసుపై మంత్రి కాకాణి రియాక్షన్
మహిళ భద్రత కోసం తీసుకు వచ్చిన దిశ యాప్ ( Disha App లో సమాచారానికి భద్రత లేదని జరుగుతున్న ప్రచారంపైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దిశ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే మహిళల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని డీజీపీ వెల్లడించారు. శాంతి భద్రతల ( law And Order ) విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని.. కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.