MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు
MP Raghu Rama Krishna Raju : ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదంపై సీఐడీ చీఫ్ ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పారని ఎంపీ రఘురామ విమర్శించారు. జిమ్ స్టాఫెర్ట్ రెండు లేఖలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
MP Raghu Rama Krishna Raju : ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రతిపక్షాల విమర్శలకు, ప్రభుత్వ తరఫున రోజుకొకరు వివరణ ఇస్తూ వీడియో వ్యవహారాన్ని సాగదీస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ వీడియో ఫేక్ అని ఖండించారన్నారు. అయితే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ రంగంలో దిగి అద్భుతంగా ట్రిపులార్ సినిమా స్టోరీ చెప్పారని ఎంపీ రఘురామ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రఘురామ... అమెరికా ప్రైవేట్ ల్యాబ్ సంస్థ ఇచ్చిన ఒరిజినల్ లెటర్ సునీల్ కుమార్ మీడియాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జిమ్ స్టాఫెర్డ్ సంతకం లేకుండా లేఖ ఇచ్చారన్నారు. సునీల్ కుమార్ రాసిన లేఖకు రిప్లయ్ ఇచ్చిన జిమ్ స్టాఫెర్డ్ పంపిన రెండో లేఖ ఏమైదని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని సునీల్ కుమార్ ఎలా చెప్తారని రఘురామ ప్రశ్నించారు.
గోరంట్లపై చర్యలేవి?
చిన్న పిల్లలకు దెబ్బ తగిలితే అమ్మ అంటారని, వైసీపీ నేతలకు ఏంజరిగినా కమ్మ లేకపోతే టీడీపీ అంటున్నారని ఎంపీ రఘురామ విమర్శించారు. పృథ్విరాజ్‌పై తీసుకున్నంత వేగంగా గోరంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారని, ఈ వ్యవహారంలో టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ దగ్గర ఉన్న రెండు లేఖలు విడుదల చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.
తీర్పు రిజ్వర్ చేసి 8 నెలలు
విద్యుత్ ఎక్స్ఛేంజీలో ఏపీకి విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేస్తామని కేంద్రం చెప్పిందని ఎంపీ రఘురామ అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల మూడు నెలలు అయిందని, కానీ వైసీపీ ఈ విషయాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్ని్స్తున్నారన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ సమస్య లేదన్నారు. సీఎం జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు నడుస్తున్నాయని, సీబీఐ కేసు ఉంది కాబట్టి ఈడీ విచారణ ఆపాలని కోర్టును కోరారన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశానని, విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి 8 నెలలు అవుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.
రిపోర్టును మార్చారంటున్న సీఐడీ
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివరణ ఇచ్చారు. ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ ఉండదన్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికమని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆ వీడియోని మూడో వ్యక్తి షూట్ చేశాడని.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని ఆయన చెప్పారు. రెండు ఫోన్‌లలో జరిగిన సంభాషణే ఒరిజినల్ అని సునీల్ కుమార్ తెలిపారు. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల చెప్పారని.. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారని సునీల్ కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించి విడుదల చేసిన రిపోర్టుపైనా తాము విచారణ జరిపామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్‌ని కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారని సీఐడీ చీఫ్ తెలిపారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని .. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారని సునీల్ కుమార్ పేర్కొన్నారు. వీడియో కంటెంట్ ఒరిజనలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని.. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నామన్నారు.
Also Read : Dirty Politics : మాధవ్ వీడియో చుట్టే ఏపీ రాజకీయాలు ! ఇంతకీ తప్పెవరు చేస్తున్నారు?