YS Avinash Reddy bail cancel : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు - తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana : వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
Dastagiri filed a petition to cancel the bail of YS Avinash Reddy ఛ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) అనుచరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న అప్రూవర్ దస్తగిరి (Dastagiri) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. విచారణకు స్వీకరించింది. సీబీఐతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డికి, వివేకా కుమార్తె సునీతారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనా రద్దు మాత్రం కాలేదు. లో సునీతారెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరారు. దీంతో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆమె అభిప్రాయం కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా విచారణ జరిపి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అలాగే సీబీఐ కూడా ఈ పిటిషన్ పై తమ అభిప్రాయం చెప్పబోతోంది.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. సాక్షులను ప్రభావితం చేయరాదు, సాక్ష్యాలను తారుమారు చేయరాదు అన్న బెయిల్ నిబంధనలను అవినాశ్ రెడ్డి అతిక్రమించారని దస్తగిరి ఆరోపించాడు. అప్రూవర్ గా తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, లేకపోతే తన కుటుంబం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని దస్తగిరి పేర్కొన్నాడు.
వివేకా హత్య కేసులో అరెస్టయిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇటీవలే బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. శివ శంకర్ రెడ్డి రెండు లక్షలు, రెండు షూరిటీ లు సమర్పించాలనే షరతులు పెట్టడం తో పాటు హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి వీల్లేదన్న శ్రుతులు విధించింది.అలాగే పాస్ పోర్ట్ సరెండర్ చేయ్యాలని ఆదేశాలిచ్చింది.ప్రతి సోమవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి కూడా బెిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.