అన్వేషించండి

AP TDP Vs BJP : ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు - పొత్తు ప్రయత్నాలు తేలిపోయాయా ?

ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. చంద్రబాబు , అచ్చెన్నపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

AP TDP Vs BJP : ఏపీలో టీడీపీ , బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి.  జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మనిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని మరి చర్యలెప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు .. ఏపీ టీడీప అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఈ విషయాలను ప్రకటిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండి పడుతున్నారు. అచ్చెన్నాయుడు తీరును విమర్శిస్తున్నారు. 

వైసీపీపై చర్యలు తీసుకోవాలని బీజేపీని డిమాండ్ చేస్తున్న అచ్చెన్నాయుడు 

రాష్ట్రంలో పాలన గాడి తప్పినప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం కల్పించుకునే అధికారం ఉందని... ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అచ్చెన్నాయుడు ఇటీవల డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు ఏపీలో అరాచక పాలన ఉందని అన్నారని ఆయన అంటున్నారు.   ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం, నేరాలపై అమిత్ షా తో పాటు నడ్డా కూడా ఆందోళన వ్యక్తం చేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.  వివేకా కేసులో సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి  చేస్తోందని..  ఏపీలో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస బీజేపీకి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

అచ్చెన్న, చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు 
 
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  గతంలో ఏపీలోకి సిబిఐని చంద్రబాబు అనుమతించలేదని, అమిత్ షాపై తిరుపతిలో దాడి జరిగితే చంద్రబాబు చర్యలు తీసుకోలేదని సోము విమర్శలు గుప్పించారు.  ఆ విషయాలపై మాట్లాడే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్ విసిరారు. ల చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయనను మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని సోము నిలదీశారు.   సోము వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చిన జగన్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరితే సోముకు ఎందుకు అంత కోపం వచ్చిందని అచ్చెన్న ప్రశ్నించారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంసంపై, పాలనపై పోరాడాల్సిన సోము వీర్రాజు ఆ పార్టీని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణం అన్నారు.  

అచ్చెన్నాయుడుపై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు 
 

అచ్చెన్నాయుడు తీరు  ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలేయడం చేతకాని తనమేనన్నారు.  వైసీపీపై పోరాడలేక  
బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో  పోటీ చేయలేక పారిపోయారు..స్థానిక ఎన్నికల్లో నామినేషన్లలు వేసి మరీ పోటీకి దూరంగా ఉన్నారన్నారు.  ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా వైఫల్యంగా చెందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ గా ఘోర వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గుర్తించారని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే 2018-19లోనే ఏపీలో రాష్ట్రపతి  పాలన విధించేవారని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో  సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా పై తిరుపతిలో రాళ్ల దాడి జరిగిందన్నారు.  ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు బీజేపీని దెబ్బతీసే కుట్రలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అమలు చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.   కేంద్రం .. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. ఆ రెండు పార్టీలు ఒకటేనన్న అభిప్రాయం కల్పించేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోజూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.   


పొత్తులు ఉంటాయనుకున్న పార్టీల మధ్య ఇలా మాటల మంటలు పెరుగుతూండటంతో.. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget