Hanuma vihari Meets Lokesh : పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం - హనుమ విహారికి లోకేష్ సపోర్ట్
Hanuma Vihari : ఏపీలో వైసీపీ రాజకీయాలకు నష్టపోయిన హనుమ విహారికి న్యాయం చేస్తామని నారా లోకేష్ తెలిపారు. క్రికెటర్ అమరావతిలో నారా లోకేష్ ను కలిశారు.
Cricketer Hanuma Vihari meets Nara Lokesh : తిరుపతికి చెందిన ఓ వైసీపీ నేత కుమారుడు ఆంధ్రా టీంలో ఉన్నారని ఆయనను ఏదో అన్నారని కెప్టెన్ పదవి నుంచి హనుమ విహారిని తొలగించిన అంశం ఎన్నికలకు ముందు హాట్ టాపిక్ అయింది. దీంతో ఆంధ్రాకే ఆడకూడదని విహారి నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకు ఇతర రాష్ట్రాల టీముల్లో ఆడేందకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంది. కానీ వైసీపీ నేతల గుప్పిట్లో ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్వోసీ జారీ చేయలేదు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర ఓటమి ఖాయమని తేలడంతో.. కౌంటింగ్ రోజునే ఆ ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేశారు.
Delighted to meet Indian cricketer @hanumavihari today. How he was subjected to political bullying, humiliated and driven out of Andhra Cricket by the earlier Govt was shameful. I have invited him back to Andhra Pradesh and asked him to strive to make Telugus proud once again. He… pic.twitter.com/6RlEeIbLUD
— Lokesh Nara (@naralokesh) June 25, 2024
తాజాగా ఏసీపీలోని అంశాలపై మాట్లాడేందుకు క్రికెటర్ హనుమ విహారి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఆ తర్వాత లోకేష్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతున్నదని ప్రకటించార.ు
క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన పి.శరత్ చంద్రారెడ్డిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించుకోవడంతో గత ప్రభుత్వం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ‘రాజకీయ క్రీడ’ మొదలుపెట్టింది. తమ పార్టీ నాయకుడి కుమారుడు, జట్టులో 17వ ఆటగాడు అయిన కుంట్రపాకం పృధ్వీరాజ్ ను ప్రోత్సహించేందుకు అసమాన ప్రతిభాపాటవాలు ఉన్న హనుమ విహారి లాంటి క్రికెటర్ ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధించింది, అవమానించిందని గుర్తు చేశారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరుతో విసిగిపోయిన హనుమ విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు , పవన్ కల్యాణ్ , తాను కూడా స్పందించి హనుమ విహారికి అండగా ఉన్నామన్నారు. క్రికెట్ అభిమానులు ఎందరో హనుమ విహారికి సంఘీభావం తెలిపారు. హనుమ విహారి తన క్రికెట్ అనుభవాన్ని ఇతరులకు నేర్పేందుకు కూడా ఆనాటి వ్యవస్థ అడ్డుపడిందన్నారు.
రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. అన్ని ఆటల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. క్రికెటర్ హనుమ విహారికి పూర్తి న్యాయం చేసేందుకు మాట ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.