CPS Cancellation: జనవరి నుంచి సీపీఎస్ రద్దు కోసం పోరాటం ఉద్ధృతం - యూటీఎఫ్!
CPS Cancellation: సీపీఎస్ రద్దు పోరాటాన్ని జనవరి నెల నుంచి మరింత ఉద్ధృతం చేస్తామని యూటీఎఫ్ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రజల అభిప్రాయాలను సంతకాలు రూపంలో సేకరిస్తున్నారు.
CPS Cancellation: సీపీఎస్ రద్దు పోరాటాన్ని వచ్చే ఏడాది జనవరి నెల నుంచి పోరాటం చేస్తామని ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ.. సంతకాల సేకరణ చేపట్టారు. నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు వంటి వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు అంటున్నారు. అప్పటికీ దిగిరాకపోతే ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు విభజన హమీలపై.. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షాల మేరకు పోరాటనికి సిద్ధం కావాలని.. అందుకు ఉద్యోగ సంఘాలు సైతం కలిసి వస్తాయని చెప్పారు.
"ఈరోజు సీపీఎస్ విధానం కూడా కార్పొరేట్లకు లాభం చేకూర్చేవే. గ్యారంటీ లేనటువంటి పెన్న్ అని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం పెన్షన్ ను గ్యారంటీ అని చెప్తా ఉంది. అలాగే 33 శాతం ఇస్తామంటుంది. ఇప్పి వరకు ఏ ప్రభుత్వం కూడా ఉద్యమాలు చేస్తామని చెప్తే... హెచ్చరికలు వదిలేసింది తప్ప అరెస్టులు చేయలేదు. ఈ ఒక్క ప్రభుత్వం మాత్రమే కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. అయితే డిసెంబర్ వరకు ఇందుకు సంబంధించి సంతకాలు సేకరిస్తాం. సీపీఎస్ ఉద్యోగి ఇంటింటికీ వెళ్లడం దానితోపాటు పాయాత్రలు చేయడం.. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జనవరి ఒకటి నుంచి ప్రభుత్వాన్ని నిర్బంధిస్తాం. అవసరమైన ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తాం. సీపీఎస్ ను రద్దు చేయాల్సిందే. సీపీఎస్ ను అస్సలే అంగీకరించం" - యూటీఎఫ్
నాలుగు నెలల క్రితం సీపీఎస్ రద్దు కోసం ఏపీ అప్పులు..
సీపీఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ సర్కారు అటకెక్కించినట్లేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి అప్పుల వ్యవహారంలో వచ్చిన తాజా పరిణామంతో ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ - సీపీఎస్ పథకంలోి ప్రభుత్వం, ఉద్యోగల వాటాను చూపించి ఏపీ సర్కారు కొత్త రుణాలను తీసుకోవాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి కూడా పొందింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి విషయాన్ని వెల్లడించారు.
ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు..
సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు అసలే లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే రాష్ట్రానికి సరిపడా ఆదాయం లేక అప్పులు చేయడంపైనే ఆధారపడింది సర్కారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ వెళ్తోంది ప్రభుత్వం. జీఎస్డీపీలో 3.5 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి రుణాలు తీసుకునేందుకు ఆర్థిక సంఘం అనుమతించింది.
ఈ మేరకు 2022-23 ఆర్థిక ఏడాదిలో ఏపీ రూ.44,574 కోట్లు మాత్రమే రుణాలు తీసుకోవాలని ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. అంతకుమించి రుణాలు తీసుకోవద్దని హెచ్చరించింది. సీపీఎస్ నిధుల వాటా ఆధారంగా మరో రూ.4203.96 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,92,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ తర్వాత ఒకేసారి డబ్బు ఇచ్చే విధంగా ఉద్యోగుల వేతనం నుండి 10 శాతం సీపీఎస్ కింద జమ చేస్తారు. అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ రెండింటి మొత్తాన్ని అథారిటీకి జమ చేస్తుంది సర్కారు.