CPI Narayana: కోపం కాదు అసహ్యం ! టాలీవుడ్ టాప్ హీరోపై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

సీపీఐ నారాయణ హీరో నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ బిగ్ బాస్ షో, నాగార్జునపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

బిగ్ బాస్ పేరు చెబితే చాలు సీపీఐ నారాయణకు చిర్రెత్తుకు వస్తుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించింది. దీనిపై స్పందించినప్పుడు కూడా చింతామణి నాటకాన్ని కాదు బిగ్ బాస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ అంటే సీపీఐ నారాయణ చిరాకు ఆ లెవల్ లో ఉంటుంది. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హోస్ట్ హీరో నాగార్జునపై కూడా నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. 
బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలే పూర్తి అయింది. త్వరలో బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం చేస్తామని ఇప్పిటికే నిర్వాహకులు ప్రకటించారు. బిగ్ బాస్ ఓటీటీ 24 గంటలూ ప్రసారం అవుతుందని పేర్కొన్నారు. 

నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ 

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలపై తరచూ స్పందించే సీపీఐ నారాయ‌ణ‌ నిత్యం వార్తల్లో ఉంటారు. వివాదాస్పద అంశాల‌పై తనదైన శైలిలో స్పందించే సీపీఐ నారాయ‌ణ తాజాగా ఓ వార్తా ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరో నాగార్జున‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ హౌస్ ని మీరు బ్రోత‌ల్ హౌస్ అని ఎందుకు అన్నార‌ని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా... సీపీఐ నారాయ‌ణ బిగ్‌బాస్ షో, ఈ షోకు హోస్ట్ గా వ్యవహ‌రించిన హీరో నాగార్జున‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్‌? ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావ్? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్? అనేది బిగ్‌బాస్ షో అని నారాయణ ఆగ్రమం వ్యక్తం చేశారు. నాగార్జున అంటే కోపం కాదని అస‌హ్యం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నాగార్జునపై నారాయణ నిజంగా అలా అన్నారా లేక ఇంటర్వ్యూ ప్రోమోలో అలా కట్ చేశారా తెలియాల్సి ఉంది. 

కమ్యూనిస్టు అంటే ఇలా ఉంటారా..?

క‌మ్యూనిస్టు నాయ‌కుడిగా ఎదిగిన నారాయణ ఇలా తయారయ్యారే అని ప్రశ్నకు  ఇస్త్రీ బ‌ట్టలు వేసుకోకూడ‌దు. తెగిపోయిన చెప్పులు వేసుకోవాలి. గ‌డ్డం పెంచాలి అప్పుడే నిజ‌మైన కమ్యూనిస్టు అంటారా అని సమాధానం ఇచ్చారు. అదొక భ్రమ అని తేల్చేశారు. చిన‌జీయ‌ర్ స్వామితో చాలా మంది క‌మ్యూనిస్టు భావాలున్నాయ‌ని చెప్తున్నారని సీపీఐ నారాయ‌ణ‌ అన్నారు. అస‌లు క‌మ్యూనిస్టులు అంటే ఇప్పటి త‌రానికి ఎవ‌రు అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. అయితే అస‌లు సిస‌లైన క‌మ్యూనిస్టులెవ‌రు, ఎలా ఉండాలో ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. 

Also Read: బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం... బ్యాన్ చేయాలంటున్న నారాయణ

Published at : 04 Feb 2022 07:44 PM (IST) Tags: Tollywood CPI narayana Hero Nagarjuna BiggBoss 5 Telugug BiggBoss Show

సంబంధిత కథనాలు

Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!

Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య, అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి

Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య, అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

టాప్ స్టోరీస్

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా