AP Covid Update: ఏపీలో కొత్తగా 1,461 కరోనా కేసులు.. 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,461 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు పశ్చిమ గోదావరి (235), కృష్ణ (210), నెల్లూరు (195), చిత్తూరు (195), గుంటూరు (182) జిల్లాల్లో నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ బులెటిన్ విడుదలైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,461 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 63,849 పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు వెల్లడైంది. వీటిలో అత్యధిక కేసులు పశ్చిమ గోదావరి (235), కృష్ణ (210), నెల్లూరు (195), చిత్తూరు (195), గుంటూరు (182) జిల్లాల్లో నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: As on 10th August 2021 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 10, 2021
COVID Positives: 19,82,287
Discharged: 19,49,841
Deceased: 13,564
Active Cases: 18,882#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5YE1V4FI03
ఇక గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీరితో కలిపి కోవిడ్ మృతుల సంఖ్య 13,564కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ సోకిన వారిలో 2,113 మంది కోలుకున్నారని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,52,736కి చేరుకుంది. ప్రస్తుతం 18,882 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,53,11,733 శాంపిళ్లను వైద్య ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Also Read: నా కొడుకు నిరపరాధి...24 గంటల్లో విడిచిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాం...
తెలంగాణలో మరింత తగ్గిన కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 89వేల 37 కరోనా పరీక్షలు చేయగా 494 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల 50వేల 353కు చేరాయి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడించింది.
24 గంటల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతులు సంఖ్య 3వేల 8వందల 31కి చేరింది. వైరస్ బారిన పడి 621 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 8,112 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రమాదం ఇంకా తగ్గలేదని... మాస్క్‌లు ధరించాలని... సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు అధికారులు. వ్యాక్సినేషన్ కూడా శరవేగంగా సాగుతోందని... అంతా వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలుకుతున్నారు.
Also Read: టమోటా ట్రేల మధ్య ఎర్రబంగారం.. మరో కిలోమీటరు దాటితే సేప్ అనుకున్నారు.. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది