Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 671 పాజిటివ్ కేసులు.. 3 జిల్లాల్లో కరోనా రికవరీ భేష్
ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,219కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 671 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,50,968కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులో మరో 10 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,219కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
కరోనా నిర్ధారణ పరీక్షలు ఏపీలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో నేటి ఉదయం వరకు 2 కోట్ల 85 లక్షల 17 వేల 990 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో గడిచిన 24 గంటల్లో 41,523 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈవారం ప్రారంభానికి ముందు ప్రతిరోజూ గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. గత వారం చివరి నుంచి 1000 దిగువన పాజిటివ్ కేసులు రావడం ఊరట కలిగిస్తోంది.
Also Read: 12 శాతం వడ్డీ - 4 వారాల గడువు.. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం !
#COVIDUpdates: 05/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 5, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,50,968 పాజిటివ్ కేసు లకు గాను
*20,27,608 మంది డిశ్చార్జ్ కాగా
*14,219 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,141#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jF2lTW9YeG
ఏపీలో అక్టోబర్ 5న ఉదయం 10 గంటల వరకు నమోదైన మొత్తం 20,50,968 పాజిటివ్ కేసులకు గాను.. 20,27,608 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10 వేల దిగువకు రావడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,141 ఉన్నాయని ఏపీ వైద్య శాఖ మంగళవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గానే ఉంది. నిన్న ఒక్కరోజులో 1,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Also Read: కొబ్బరి డొక్క, దానిమ్మ తొక్క.. ఇవే రూమ్ ఫ్రెషనర్లు... ఇప్పుడిదే సరికొత్త ట్రెండ్
నిన్న ఒక్కరోజులో కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, కడప, నెల్లూరు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. అత్యధికంగా చిత్తూరులో 102 మందికి తాజాగా కరోనా సోకింది. తూర్పు గోదావరిలో 65, గుంటూరులో 91, ప్రకాశంలో 74 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ముగ్గరికి కరోనా సోకింది. అనంతపురం, కడప జిల్లాల్లో 9 మంది కరోనా బారిన పడ్డారు.