Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా వెయ్యికి పైగా కరోనా కేసులు.. ఓ జిల్లాలో తీవ్ర ప్రభావం
గత రెండు రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతుండగా, మరోవైపు యాక్టివ్ కేసులు దిగిరావడం కాస్త ఊరట కలిగిస్తోంది. కొవిడ్19 మరణాలు నిన్నటితో పోల్చితే అధికమయ్యాయి.
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. వరుసగా రెండు రోజులు వెయ్యి దిగువన ఉన్న పాజిటివ్ కేసులు మరోసారి వెయ్యి మార్కు దాటాయి. ఏపీలో గత రెండు నెలలుగా వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కోవిడ్19 కేసులు వస్తున్నాయని తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,084 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 13 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు అధికమయ్యాయి.
యాక్టివ్ కేసులలో ఊరట..
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,46,419 పాజిటివ్ కేసులకు గాను.. 20,20,601 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 14,163 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు దిగి రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఏపీలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,655 అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం తాజా బులెటిన్ విడుదల చేసింది.
Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి
#COVIDUpdates: 29/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 29, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,46,419 పాజిటివ్ కేసు లకు గాను
*20,20,601 మంది డిశ్చార్జ్ కాగా
*14,163 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,655#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TYoslm0NvS
ఏపీలో కరోనా రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ నెల మొదట్లో 15వేలుగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేలకు దిగొచ్చింది. పాజిటివ్ కేసులకు రెట్టింపు డిశ్ఛార్జ్ కేసులు ఉండటం ఊరట కలిగిస్తుందని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజులో 1,084 మంది కరోనా బారిన పడగా, అదే సమయంలో 1,328 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజులో ఏపీలో చిత్తూరులో అయిదుగురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు కరోనాకు చికిత్స పొందుతూ చనిపోయారు.
Also Read: బీట్ రూట్‌ని బలవంతంగా కాదు ఇష్టంగా తినండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇదో ఔషధాల గని
కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు..
ఏపీలో నేటి ఉదయం వరకు 2 కోట్ల 82 లక్షల 35 వేల 650 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో గడిచిన 24 గంటల్లో 57,345 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. కేసులవారీగా చూస్తే అత్యధికంగా తూర్పు గోదావరిలో 244, చిత్తూరులో 147, ప్రకాశంలో 122, నెల్లూరులో 115, గుంటూరులో 111, కృష్ణాలో 113 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో అయిదుగురికి కరోనా సోకింది.
Also Read: మీ గుండె జాగ్రత్త.. ఈ ఆహారాన్ని దూరం పెడితే ఆయుష్సు పెరుగుతుంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి