Vidya Deevena : గురువారం విద్యా దీవెన - తిరుపతిలో బటన్ నొక్కనున్న జగన్!
విద్యాదీవెన పథకం కింద నిధులను సీఎం జగన్ గురువారం తిరుపతిలో మీట నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
విద్యాదీవెన పథకం కింద ఫీజురీఎంబర్స్ మెంట్ నిధులు గురువారం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. జనవరి – మార్చి, 2022 త్రైమాసికానికి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను జగన్ తిరుపతిలో బటన్ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 10,994 కోట్ల అని ప్రభుత్వం తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవని. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
దుగ్గిరాలలో ఎంపీపీ ఎలక్షన్ టెన్షన్ - ఎమ్మెల్యే ఆర్కేపై ఎంపీటీసీ కిడ్నాప్ ఆరోపణలు !
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు విద్యా దీవెన పథకాన్ని్మలుచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం.
"అడ్డా"లో ప్లాన్ చేశారు - అడ్డంగా నరికేశారు ! గంజి ప్రసాద్ మర్డర్ ప్లాన్ బయట పెట్టిన పోలీసులు
కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ఇస్తున్నారు. కాలేజీల్లో జవాబుదారీ తనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. తల్లుల ఖాతాల్లో జమ అయిన నగదును వారుతీసుకెళ్లి కాలేజీల్లో కట్టాల్సి ఉంటుంది. కాలేజీల్లో వసతుల్ని పరిశీలించి.. ఏమైనా ఇబ్బందులు ఉంటే కాలేజీ యాజమాన్యాలను విద్యార్థుల తల్లులు ప్రశ్నించవచ్చని జగన్ తెలిపారు అప్పుడుకాలేజీల్లో జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు.