By: ABP Desam | Updated at : 26 Nov 2022 01:17 PM (IST)
రాజ్యాంగం రూల్ బుక్‌గా అభివర్ణించిన సీఎం జగన్
CM Jagan : భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 72 ఏళ్లుగా రాజ్యాంగం సామాజికవర్గాల చరిత్రను తిరగరాసిందన్నారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిగా గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన ప్రభుత్వం తమదని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తు చేశారు.
దేశాన్ని ఒకేతాటిపై నడిపించే రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/KJmUnmr2nY
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2022
వేర్వేరు భాషలు, కులాలు, ప్రాంతాలు కలిగిన దేశానికి క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక రాజ్యాంగమన్నారు. దేశం మారడానికి, ప్రపంచంతో పోటీ పడటానికి రాజ్యాంగం రచించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త కూడా అని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహానికి ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమం వద్దంటూ చేస్తున్న నయా అంటరానితనం నుంచి విద్యార్థులకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నామన్నారు. సంస్కరణల ద్వారా వెనుకబాటుతనంపై దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడుతుందని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మహిళా సాధికారికతకు అర్థం చెబుతూ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాజ్యాంగం మనకు క్రమశిక్షణ నేర్పించే రూల్ బుక్ అని ఆయన అన్నారు. రాజధానికి సేకరించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. 35 నెలల్లో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి సామాజిక న్యాయం అమలు చేసిందన్నారు.
1949 నవంబర్ 26న భారతదేశం.. రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఐతే.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు.2015 నవంబర్ 19న... కేంద్ర ప్రభుత్వం.. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 2015 అక్టోబర్ 11న ముంబైలో.. సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ.. ఈ ప్రకటన చేశారు. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు
Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు