అన్వేషించండి

Jagananna Thodu Scheme: 'జగనన్న తోడు పథకం దేశానికే ఆదర్శం' - వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

Andhra News: 'జగనన్న తోడు' పథకం కింద ఎనిమిదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన చిరు వ్యాపారులకు, హస్త కళాకారులకు, చేతివృత్త కళాకారుల ఖాతాల్లో నిధులు విడుదల చేశారు.

CM Jagan Released Jagananna Thodu Funds: 'జగనన్న తోడు' పథకం దేశానికే ఆదర్శమని.. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారు. తాడేపల్లిలోని (Tadepalli) క్యాంపు కార్యాలయంలో గురువారం ఎనిమిదో విడత 'జగనన్న తోడు' (Jagananna Thodu) పథకం కింద నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. 3.95 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, అంతకుపైన కలిపి రూ.417.94 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. మొత్తంగా రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నామ‌ని, రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌ని సీఎం జగన్ తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 16,73,580 చిరువ్యాపారులకు వడ్డీ  చెల్లించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 87.13 శాతం అక్కచెల్లెమ్మలు లబ్ధి పొందారని, ఇది మహిళా సాధికారతలో మరో విప్లవమని పేర్కొన్నారు. 'దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద పీఎం స్వనిధి పథకం కింద 58.63 లక్షల మందికి రుణాలు ఇస్తే.. రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు. కేంద్రం రూ.10,220 కోట్లు ఇస్తే మన రాష్ట్రంలో రూ.3,337 కోట్లు ఇచ్చాం.' అని సీఎం పేర్కొన్నారు.

వాటితోనే సాధ్యం 

అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చే 7 శాతం రుణాలు ఇస్తుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే వడ్డీ రూపంలో రూ.88 కోట్లు చెల్లించినట్లు జగన్ తెలిపారు. సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని ఉద్ఘాటించారు. పారదర్శకంగా రుణాలు ఇప్పించగలుగుతున్నామని, అదే విధంగా వాళ్లు రుణాలు చెల్లించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడిందని అన్నారు. రుణాల రికవరీ 90 శాతం పైగానే ఉందని తెలిపారు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.

'జగనన్న తోడు' అంటే.?

రాష్ట్రంలో నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణాన్ని సున్నా వడ్డీకే ఇస్తుంది. రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1000 చొప్పున జోడిస్తూ రూ.13 వేల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు. 8వ విడతగా రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకూ వడ్డీ లేని రుణాలు రూ.3,373.73 కోట్లు అందించారు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, టిఫిన్స్ అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు, సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వ్యాపారాలు చేసుకునే వారు, చేనేత, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు.

Also Read: Vijayawada News: కేశినేని నానికి చిన్ని స్ట్రాంగ్ కౌంటర్- కుటుంబ కలహాలపై క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Embed widget