News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP CM Review : ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ - ఉన్నత విద్యాశాఖలో పోస్టుల భర్తీకి జగన్ ఆదేశం !

ఉన్నత విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.

FOLLOW US: 
Share:

AP CM Review :   ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన అదికారులకు సూచించారు. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌ నాటికి నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలని జగన్ అదికారులకు సూచించారు.ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని.  అందుకే  సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.  డిగ్రీ చదువుతున్న వారి నైపుణ్యాలను బాగా పెంచాలని సీఎం జగన్ అన్నారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలన్నారు. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించారు. 

జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ ఉండాలని .. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరిక్యులమ్‌లో భాగం కావాలని సూచించారు.  ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందని జగన్ చెప్పారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టై అప్‌ చేసుకోవాలని సూచించారు. రిస్క్‌ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సుల పై దృష్టి పెట్టాలని,వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలని జగన్ సూచించారు. 
 
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.  ప్రతి విద్యా సంస్థ కూడా నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలని,మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలన్నారు. అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
 
కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాళ్టి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలని జగన్ అన్నారు. కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్‌ పాలసీ ఉండాలని సూచించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు.కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు.విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుందని,ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలన్నారు. సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానెల్స్‌ రిపేరు రంగంలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉందని,ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలన్నారు.ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలని,వచ్చే జూన్‌ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చించారు.

Published at : 19 Jan 2023 06:04 PM (IST) Tags: AP Education AP CMO ap updates

ఇవి కూడా చూడండి

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

టాప్ స్టోరీస్

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!