AP News : కీలక నేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ - రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ !
కీలక నేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ నిర్వహించారు. తాజా పరిణామాలపై చర్చించారు.
AP News : వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత మంది కీలక నేతలతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. మమూలుగా ఈ రోజు అనంతపురం జిల్లా శింగనమలలో పర్యిటించాల్సి ఉంది. విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కాల్సి ఉంది. కానీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయం పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు హైదరాబాద్ బయలుదేరారు. కానీ మధ్యలో సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో విజయవాడ చేరుకుని .. సమావేశంలో పాల్గొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ హఠాత్తుగా వేగం పెంచడం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో పాటు అవినాష్ రెడ్డిని కూడా నిందితునిగా చేర్చింది. అవినాష్ రెడ్డిని కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఈ పరిణామాలతో ఆయన అరెస్టు కూడా జరుగుతుదన్న ప్రచారం ఉంది. ఈ పరిణామాలపై ఎలా స్పందించాలి.. ఎలాంటి రాజకీయ వ్యూహాలు అలంభిచాలన్నదానిపై సీఎం జగన్ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించినట్లుగా తెలుస్తోంది.
అవినాష్ రెడ్డి కుటుంబానికి మద్దతుగా ఉంటున్న సీఎం జగన్
అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాత్రమే కాదు.. సీఎం జగన్‌కు సోదరుడు అవుతారు. కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కావడంతో పాటు.. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి కుటుంబానికి జగన్ మద్దతుగా ఉంటున్నారు. అదే సమయంలో సీఎం జగన్ సతీమణి భారతి అటెండర్ నవీన్ , సీఎం జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డిలను సీబీఐ విచారణ జరిపింది. వారికి అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారు జామున ఫోన్ చేసినట్లుగా కాల్ రికార్డ్స్ ఉండటంతో ఈ విచారణ జరిపింది. అందుకే ఈ కేసు విషయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని న్యాయనిపుణులతోనూ మాట్లాడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
హత్యకు కారణాలు వేరే ఉన్నాయంటున్న అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి కానీ ఆయన కుటుంబానికి ఏమీ సంబంధంలేదని.. ఓ కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని జగన్ అసెంబ్లీలో చెప్పారు. ఈ హత్య ఘటనలో జరుగుతోందంతా తప్పుడు ప్రచారమేనంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి .. వైఎస్ వివేకా చేసుకున్న రెండో పెళ్లి వల్లనే ఈ హత్య జరిగిందని కోర్టుకు చెబుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి వివాహేతర బంధం వల్ల.. ఈ హత్య జరిగిందని వాదిస్తున్నారు. ఈ కేసులో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటూడటంతో ఎప్పుడేం జరుగుతోందనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.