అన్వేషించండి

YSRCP Tekkali : దువ్వాడ శ్రీను షాక్ ఇచ్చిన సీఎం జగన్ - టెక్కలి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా దువ్వాడ వాణి పేరు ఖరారు !

టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి దువ్వాడ వాణిని ఖరారు చేశారు సీఎం జగన్. అనూహ్యంగా చేసిన ఈ మార్పుతో వైసీపీలో కలకలం ప్రారంభమయింది.


YSRCP  Tekkali  :  టెక్కలి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ  వాణిని ఖరారు చేశారు. ఈ విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ నేరుగా ప్రకటించారు.  కొన్నాళ్లుగా టెక్కలి వైకాపాలో, ముఖ్యంగా దువ్వాడ కుటుంబంలో రాజకీయ ఆధిపత్యం కోసం తగాదా నడుస్తోంది. ఇదంతా దువ్వాడ స్వయంకృతాపరాధమే. వర్గపోరు.. అనేక ఆరోపణలు.. జిల్లాలోని కీలకనాయకులతో విభేదాలు.. ఇలాంటివేవీ ఆయనను రాజకీయంగా కదిలించలేకపోయాయి. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మంచి మార్కులు అనూహ్యంగా దువ్వాడను మండలిలో కూర్చోబెట్టాయి. అయితే కుటుంబసభ్యులే ఆయనకు ఎదురు తిరగడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతని వ్యవహారశైలి, కొన్ని బలహీనతలు దీనికి కారణమయ్యాయి. చివరికి ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

ఓ మహిళ జోక్యంతో తిరగబడిన దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జాతకం

స్వయంగా దువ్వాడే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైకాపా తరఫున వాణీ బరిలో ఉంటారని శుక్రవారం ప్రకటించడంతో కొన్నాళ్లుగా కుటుంబంలో నడుస్తున్న రాజకీయ పంచాయతీకి తెరపడినట్లయింది.  వైకాపా అధికారంలోకి వచ్చాక జిల్లాలో దువ్వాడ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రద రిస్తూ వచ్చారు. ఆయనను ఇన్ఛార్జ్ ప్రకటించి తిలక్‌కు  కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. సీఎంఓలోనూ దువ్వాడకు మంచి ప్రాధాన్యం, పలుకుబడి లభించింది. జిల్లాలో కూడా మంత్రులతో సంబంధంలేకుండా దువ్వాడ చెప్పిన పనులన్నీ అధికారులు చకచకా చేసిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్క లిలో వైకాపా సత్తా చాటింది.   ఆయ నకు మాత్రం ఎమ్మెల్సీ పదవి నజరానా కింద దక్కింది.  అయితే కొన్ని బల హీనతలు, స్థానికంగా ఉండే ఓ మహిళ ఇటీవల చేస్తున్న ప్రచారం దువ్వాడ కొంపముంచాయి. ఆ మహిళ చెప్పిన అధికారులకే పోస్టింగ్‌లలో  కూడా దువ్వాడ పెద్దపీట వేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ మహిళ వ్యవహారంతో కుటుంబంలో వివాదాలు ప్రారంభమయ్యాయి. 

సీఎం దృష్టికి తీసుకెళ్లిన దువ్వాడ వాణి 

 సీఎంఓ అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డిని వాణి కలిసి దువ్వాడ పై ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరి గింది. కొన్ని పత్రికల్లో దీనిపై కథనాలు కూడా వచ్చాయి. అయితే భారాభర్తలిద్దరూ ప్రెస్మీట్ పెట్టి వాటిని ఖండించారు. ఇటీవల దువ్వాడ వ్యవహారశైలితో వాణి విసిగిపోయినట్టు సమా చారం. మరి కొన్ని ఆధారాలు కూడా ఆమె చేతికి చిక్కడంతో ఇవన్నీ సీఎం ముందు ఉంచారట. ప్రస్తుతం టెక్కలి వైకాపాలో అగమ్యగోచర పరిస్థితి, వర్గపోరు నెలకొంది. ఈ పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి అక్కడ పార్టీ ఓటమి తధ్యమని సీఎంకు అర్థమైంది. అందుకే వాణిని సమన్వయకర్తగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో ఆమెను బరిలో నిలపా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ విష యాన్ని స్వయంగా దువ్వాడతోనే ప్రకటింపచేసి కుటుంబంలో విభేదాలున్నాయన్న ఆరోపణలకు చెక్ పెట్టాలని వైకాపా అధిష్టానం భావించింది. అందుకే శ్రీను శుక్రవారం టెక్కలి వైకాపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వ హించి వచ్చే ఎన్నికల్లో వాణి పోటీ చేస్తారని, ఆమెకు మద్దతివ్వాలని చెప్పుకొచ్చారు.

పోర్టు శంకుస్థాపనలో దువ్వాడ శ్రీనునే అభ్యర్థిగా చెప్పిన సీఎం జగన్ 
 
ఎన్నికలకు ఏడాది సమయం ఉం డగానే ఇటీవల సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన సమ యంలో నిర్వహించిన బహిరంగసభలో దువ్వాడ శ్రీనివాస్ ను వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి పార్టీ తరఫున పోటీలో నిలపనున్నట్లు జగన్ ప్రక టించారు. దువ్వాడే అభ్యర్థి అని, కేడర్ అంతా ఆయనకు సహకరించి గెలిపించాలని సూచిం చారు. ఇప్పుడు వాణీ అభ్యర్థిత్వాన్ని కూడా సీఎం అన్యమనస్కంగానే అంగీకరించినట్టు తెలుస్తోంది. దువ్వాడను తప్పించడం ఇష్టం లేక పోయినా పార్టీ, కుటుంబ పరిస్థితులను బేరీజు వేసుకొని అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారట.   దువ్వాడకు ప్రజల్లో కాస్త మంచిపేరే ఉన్నా ఫోన్ ఎత్తకపోవడం, కార్యకర్తలకు అందు బాటులో లేకపోవడం ఆయనకు మైనస్. ఇప్పుడు వాణీ హయాం ప్రారంభమైంది కాబట్టి ఆమె ఏవిధంగా ముందుకువెళ్లి టీడీపీని ఢీకొంటారన్నదే పెద్ద ప్రశ్న. బాహుబలి లాంటి అచ్చెన్నను టెక్కలిలో నిలువరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. తనను పోటీ నుంచి తప్పించారన్న అక్కసు దువ్వాడకు లోలోపల ఉండవచ్చు. ఆయన ఏ మేరకు పనిచేస్తారన్నది కూడా ప్రశ్నార్థకమేనంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget