అన్వేషించండి

AP MPTC ZPTC Election Results Live Updates: ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం

AP Parishad Election Results Live Updates | ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 365 కేంద్రాల్లో లెక్కింపు జరుగుతుండగా.. కొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.

LIVE

Key Events
AP Parishad Election Results Live Updates AP MPTC ZPTC Election counting Updates AP MPTC ZPTC Election Results Live Updates: ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ అప్డేట్స్
Source : Abp desam

Background

AP MPTC ZPTC Election Counting Live Updates | నవంబర్ 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండటంతో  21,012 మంది అభ్యర్థుల భవితవ్యంపై అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం ఉదయం 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం చేసిన 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ  ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాల మేరకు అధికారులు కౌంటింగ్ కోసం మూడంచెల పటిష్ట భద్రతతో అన్ని ఏర్పాట్లను  పూర్తి చేశారు. మొత్తం 2,61,52,377 మంది ఓటర్లకు గాను 1.85 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోవడంతో 70.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 582 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇందులో టీడీపీ నుండి 452, వైసీపీ నుండి 574, జనసేన నుండి 109, బీజేపీ నుండి 34 మందితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 2,169 మంది అభ్యర్థులు జడ్పీటీసీ బరిలో నిలిచారు. అలాగే, మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051 ఏకగ్రీవమవగా, 3 స్థానాలకు నామినేషన్లు పడలేదు. మిగిలిన 7,767 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నుండి 6,342, వైసీపీ నుండి 7,622, జనసేన నుండి 1,499, బీజేపీ నుండి 280 మంది సహా మొత్తం 18,844 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 

లెక్కింపు ప్రక్రియ కోసం 39,694 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. గతంలో వర్షాల వల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జాప్యం జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి శనివారం రాత్రి 8 గంటల లోపే కౌంటింగ్ పూర్తి చేయాలని ఎస్ఈసీ కలెక్టర్లను ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 40,679 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, కౌంటింగ్ కేంద్రాల వద్ద లోపల, బయట సీసీ కెమెరాల ద్వారా కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ఈ కౌంటింగ్ సీసీటీవీ ఫుటేజ్‌ను 60 రోజుల వరకు సురక్షితంగా భద్రపరచనున్నారు.

మొత్తం జడ్పీటీసీ స్థానాలు   -   659
ఏకగ్రీవమైన స్థానాలు     -  77
పోలింగ్ నిర్వహించినవి    -   582
పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు   -   2,169
టీడీపీ అభ్యర్థులు   -  452
జనసేన అభ్యర్థులు   -  109
బీజేపీ అభ్యర్థులు   -   34
పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు   -  574
ఇతర పార్టీలు, స్వతంత్రులు   -   1,000 

మొత్తం ఎంపీటీసీ స్థానాలు  -  9,821
అందులో ఏకగ్రీవాలు   -   2,051
నామినేషన్లు వేయని స్థానాలు   -   3
పోలింగ్ నిర్వహించిన ఎంపీటీసీలు   -   7,767
పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు   -   18,844
టీడీపీ అభ్యర్థులు   -   6,342
జనసేన అభ్యర్థులు   -  1,499
బీజేపీ అభ్యర్థులు  -  280
పోటీచేసిన వైసీపీ అభ్యర్థులు  - 7,622 
ఇతర పార్టీలు, స్వతంత్రులు   -  3,101

20:28 PM (IST)  •  07 Nov 2026

30 ఏళ్లకు చీపురుపల్లి మండలం గొల్లలములగాం ఎంపీటీసీ నెగ్గిన టీడీపీ

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాం ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి చందక దుర్గ భవాన్ని విజయంతో 30 ఏళ్ల తర్వాత ఈ స్థానంలో పసుపు జెండా ఎగిరింది.

19:24 PM (IST)  •  07 Nov 2026

బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం

బొండపల్లి: పరిషత్‌ పోరులో కూటమి విజయపరంపర కొనసాగుతోంది. విజయనగరం(Vizianagaram) జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో తెదేపా(TDP) అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడి నుంచి  పోటీ చేసిన వైకాపా నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. బొత్స అనూషపై తెదేపా అభ్యర్థి పాశల నీరజ 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నీరజ విజయంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ రేసులో ఉన్న అనూష ఓటమి పాలవడంతో వైకాపా శ్రేణులు డీలాపడ్డాయి.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chirala AP Municipal Election Results : చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Embed widget