Pulivendula ZPTC Results: కూటమి ఖాతాలోకి పులివెందుల.. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఘన విజయం
Pulivendula ZPTC Election Results | కడప జిల్లా పులివెందుల, మైదుకూరు జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది.

పులివెందుల: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ టీడీపీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు. ఇటివరకు వెలువడిన ఫలితాలు, తాజా ట్రెండ్స్‌లో కూటమి అభ్యర్థులు మేజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. పులివెందుల స్థానంలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి భారతి వైసీపీ అభ్యర్థి సావిత్రిపై 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మైదుకూరు జెడ్పీటీసీ టీడీపీ సొంతం చేసుకుంది. కడప జిల్లా మైదుకూరు జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ విజయం సాధించారు. జిల్లాలోని పెద ముడియం మండలం సుద్దపల్లె ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఎద్దుల సంజీవతి గెలుపొందారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 170కి పైగా చోట్ల, అలాగే మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,000కు పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వివిధ జిల్లాల్లో ఇప్పటివరకూ నమోదైన విజయాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెనాలి మండలం హాఫ్‌పేట ఎంపీటీసీ స్థానాన్ని కూడా టీడీపీ దక్కించుకుంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవి గెలుపొందగా, వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం సుద్దపల్లె ఎంపీటీసీ స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























