అన్వేషించండి

CM Jagan: ఆ కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. వాళ్ల దగ్గర డబ్బులు రికవరీ చేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ చలాన్ల స్కామ్ ఎంత పెద్దదో అంచనా వేయడం ఉన్నతాధికారులకు కూడా సాధ్యం కావడం లేదు.  అయితే తాజా ఈ కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారులతో భేటీ అయ్యారు.


ఏపీలో నకిలీ చలాన్ల కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.  స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ఏంటీ నకిలీ చలాన్ల కుంభకోణం


ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ చలాన్ల స్కాం ఎంత పెద్దదో అంచనా వేయడం ఉన్నతాధికారులకు కూడా సాధ్యం కావడం లేదు. పరిశీలన జరిపే కొద్దీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ 770 డాక్యుమెంట్లు నకిలీ చలాన్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించినట్లుగా రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ స్కాం స్వరూప  స్వభావాలు ప్రభుత్వం చెబుతున్న దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే  సస్పెండైన సబ్ రిజిస్ట్రార్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు పెద్ద ఎత్తున డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయాన్ని గుర్తించారు.  ఇప్పటి వరకూ 65 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించినట్లగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ స్కాంలో కేవలం రూ. ఐదు కోట్లు మాత్రమే గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం చెబితే ఇంత హడావుడి  పడాల్సిన పని లేదని ఎంత కాలం నుంచిజరుగుతుందో గుర్తిస్తే తప్ప అసలు గోల్‌మాల్‌ను అంచనా వేయడం కష్టమని నిపుణులు అంచనావేస్తున్నారు.  


సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా ఉపయోగించిన చలానానే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్లకు ఉపయోగించినందున ప్రతీ డాక్యుమెంట్‌ను నిశితంగా పరిశీలిస్తేనే అసలు విషయం  బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అసలు మూలం కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగానే రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సైతం రంగంలోకి దిగారు. కడప, కృష్ణా జిల్లాల్లో  సబ్ రిజిస్ట్రార్లు ఎక్కువ అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే ఇది మొత్తం ఇంటర్‌లింక్‌లతో నిండిన స్కాం అని భావిస్తున్నారు. ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్లు చేయించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కాం చేయడానికి మరింత స్కోప్ పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన విచారణ జరిగితే స్కాం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేయడం లేదా.. సీఐడీ విచారణకు ఆదేశించడం వంటి చర్యలు తీసుకుంటారని భావించారు. 


కానీ ప్రభుత్వం మాత్రం పోలీసు విచారణ సరిపోతుందని ఉంటున్నారు. రెవన్యూ పరంగా సోదాలు చేసి.. ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో గుర్తించి కేసులుపెడితే చాలని భావిస్తోంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టే అతిపెద్ద స్కాం కావడంతో ప్రభుత్వ చర్యలు మరింత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటేనే అవినీతికి నిలయాలన్న అభిప్రాయంఉంది. ప్రజల వద్ద నుంచి పీడించడం.. నకిలీ రిజిస్ట్రేషన్లు లాంటి దందాలతోపాటు ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఖజానాకే్ చిల్లు పెట్టేలా సబ్ రిజిస్ట్రార్లు వ్యవహరించడం సంచలనం రేపుతోంది. ముందు ముందు ఈ కేసు విషయంలో బయటపడే వ్యవహారాలు మరింత కలకలం రేపడం ఖాయంగా భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ, ఆయన ఓ తాలిబన్: కవిత తీవ్ర వ్యాఖ్యలు 
సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ, ఆయన ఓ తాలిబన్: కవిత తీవ్ర వ్యాఖ్యలు 
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Embed widget