అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Road Safty : రోడ్డు ప్రమాదాల నివారణకు మాస్టర్ ప్లాన్ రెడీ - అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం !

ఏపీలో రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని ..అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని సీఎం ఆదేశించారు.


ఏపీలో రోడ్డు ప్రమాదాలను ( Road Accidents )  గరిష్ట స్థాయిలో నివారించడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.  ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో రహదారి భద్రతా మండలి  సమావేశం నిర్వహించింది.  ఈ సమావేశంలో రోడ్‌ సేఫ్టీ ( Road Safty ) మీద లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.  పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌,  రోడ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌నుంచి నిపుణులను ఈ లీడ్ ఎజెన్సీలో నియమించాలని నిర్ణయించారు. అలాగే  రోడ్‌ సేఫ్ట్‌ ఫండ్‌ ( Road Safty Fund ) ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఫండ్‌కు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందా లేకపోతే రోడ్ సెస్ ఏమైనా అదనంగా వసూలు చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ( Hospitals List ) జాబితాలో ఉన్న వాటికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.  రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారికి మంచి సపోర్టు ఇవ్వాలని  సీఎం సూచించారు.  అలాగే  "ఐరాడ్‌ యాప్‌ " వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.  పీపీపీ పద్ధతిలో రవాణా శాఖ ద్వార ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందాంచాలని ఆదేశించారు.  రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

ఈ సమావేశంలో రోడ్ ప్రమాదాల నివారణకు సీఎం జగన్ ( CM Jagan ) కీలక సూచనలు చేశారు.  ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్‌ స్కూలు ఏర్పాటు చేయాలని ..  ఈ సదుపాయాలను ఆర్టీసీ డ్రైవింగ్‌ శిక్షణ కోసం వినియోగించుకోవచ్చని సూచించారు.   అలాగే ట్రామా కేర్‌ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని ... కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కళాశాలల్లో కూడా ట్రామా కేర్‌ సెంటర్లను ( Trama Care Center ) ఏర్పాటు చేయాలని  సీఎం అధికారులకు సూచించారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలని ఆదేసించారు.  ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను వైజాగ్‌లో ఉంచాలని .. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రుల్లో ( Burd Hospital ) ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలన్నారు.  రోడ్డుపై లేన్‌ మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు.  బైక్‌లకు ప్రత్యేక లేన్, ఫోర్‌వీల్‌ వాహనాలకు ప్రత్యేక లేన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.   ఎంత స్పీడులో పోవాలన్నదానిపై సైన్‌ బోర్డులు కూడా పెట్టాలని.. దీనివల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రమాదాలకు కారణం అయ్యే  1190 బ్లాక్‌ స్పాట్స్‌ ను గుర్తించామని  520 స్పాట్స్‌ను రెక్టిఫై చేశామని సమావేశంలో అధికారులు తెలిపారు. ఆర్‌ అండ్‌ బి నిర్వహిస్తున్న నేషన్‌ హైవేల్లో కూడా 78 బ్లాక్‌ స్పాట్స్‌ను  రెక్టిఫై చేశామన్నారు.  రోడ్ల  పక్కన ధాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని .. దీనివల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయని సీఎం ఆదేశించారు.  ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్‌ బారియర్స్‌ ఉండాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని సీఎం ఆదేశించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget