News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

CM Jagan Review : "స్మార్ట్" పద్దతిలో స్కూళ్లలో విద్యాబోధన - ప్రొజెక్టర్లు కొనాలని సీఎం జగన్ ఆదేశం !

ఏపీలో అన్ని స్కూళ్లలో స్మార్ట్ విద్యాబోధన జరగాలని సీఎం నిర్దేశించారు. ఇందు కోసం ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, ప్రొజెక్టల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

FOLLOW US: 
Share:

CM Jagan Review :    ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను  ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీస్‌లో పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ూసచించారు.  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా  నిరంతరం అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలని .. నికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించాలని స్పష్టం చేశారు. జిల్లా స్దాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలని ఆదేశించారు.  

టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌ నిధులను  సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలని జగన్ సూచించారు.  విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని నిర్ణయించడంతో వీటికి సంబంధించిన  వివిధ మోడళ్లను సీఎంకు  అధికారులు చూపించారు.  స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకూ, అటు ఉపాధ్యాయులకూ మేలు జరుగుతుందని.. తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యతతో ఉండాలని సీఎం ఆదేశించారు.   పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు పెట్టేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు.  

అన్ని హైస్కూళ్లలోనూ, నాడు –నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలని  వచ్చేవారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధంచేయాలని  సీఎం సూచించారు.   సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లపైనా సీఎం సమీక్ష చేశారు.  ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఈ ట్యాబ్‌ల్లోకి కంటెంట్‌ ను బైజూస్ లోడ్ చేస్తుంి.  విద్యాకానుకపైనా సీఎం సమీక్ష చేశారు. వచ్చే ఏడాదికి విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని ఆదేశించారు.  

విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి స్థాయిలో కూడా పర్యవేక్షణ కూడా అంతే బలంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.  విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలన్నారు.  స్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని  హాస్టళ్లలో కూడా నాడు – నేడు పనులను రెండోదశ కింద చేపట్టాలని సూచించారు.

Published at : 27 Jul 2022 05:11 PM (IST) Tags: ap cm CM Review Jagan's review on education department smart education in AP schools

ఇవి కూడా చూడండి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!

Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!

Weather Update: మిచాంగ్ తుపానుగా మారిన వాయుగుండం, ఏపీపై తీవ్ర ప్రభావం - భారీ వర్ష సూచనతో IMD రెడ్ అలర్ట్

Weather Update: మిచాంగ్ తుపానుగా మారిన వాయుగుండం, ఏపీపై తీవ్ర ప్రభావం - భారీ వర్ష సూచనతో IMD రెడ్ అలర్ట్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
×