అన్వేషించండి

CM Chandrababu: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!

Andhra News: డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

CM Chandrababu Comments In Deeptech Innovation Conclave In Vizag: ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని.. ఏపీ నాలెడ్జ్ హబ్‌గా తయారవుతోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విశాఖలో గురువారం నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌కు (Deeptech Innovation Conclave) ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాల్లో మన దేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని అన్నారు. డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. 'పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించాం. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవి. కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నాం. ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

'అదే కొత్త నినాదం'

ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోంది. రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారింది. భారత్‌లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ కీలకంగా మారింది. వాటితోనూ అన్ని పనులూ చేసుకునే పరిస్థితికి వచ్చాం. నదుల అనుసంధానంతో నీటి కొరత అనేదే ఉండదు. ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్ హబ్‌గా ఏపీ మారబోతోంది. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. పెట్టుబడులతో వస్తోన్న వారికి రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం.' అని సీఎం తెలిపారు.

పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయడమే కొత్త టార్గెట్ అని సీఎం అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047లో 15 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జనాభా ఇప్పుడు ఆస్తిగా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయని.. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు కీలకంగా మారిందన్నారు. పాపులేషన్, టెక్నాలజీ ఆధారంగా గ్లోబల్ హబ్‌గా ఇండియా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అటు, వ్యవసాయ రంగంలో ఏపీ ముందుందని.. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు టెక్నాలజీని అనుసంధానం చేసి మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఐ, ఎంఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో మార్పులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు ఉన్నారు.

Also Read: YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Dragon Movie like Scam: డ్రాగన్ మూవీకి ముందే తెలంగాణ ఇంజినీర్ ట్రై చేశాడు- కానీ ఆపరేషన్ ఫెయిల్, కేసులు నమోదు
డ్రాగన్ మూవీకి ముందే తెలంగాణ ఇంజినీర్ ట్రై చేశాడు- కానీ ఆపరేషన్ ఫెయిల్, కేసులు నమోదు
KCR Speech At BRS Meeting: ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Google Data Privacy: 300 కోట్ల యూజర్ల డేటాను సీక్రెట్‌గా స్కాన్ చేస్తున్న గూగుల్! మన డేటా సేఫేనా?
300 కోట్ల యూజర్ల డేటాను సీక్రెట్‌గా స్కాన్ చేస్తున్న గూగుల్! మన డేటా సేఫేనా?
IPL 2025 RCB VS DC Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
Embed widget