News
News
X

Chittoor Stone Crush Case: స్టోన్ క్రషర్ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కు చంద్రబాబు లేఖ

Chittoor Stone Crush Case: చిత్తూరు జిల్లా కొలసానపల్లిలో స్టోన్ క్రషర్ ను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు.. సీఎస్ కు లేఖ రాశారు. 

FOLLOW US: 
 
Chittoor Stone Crush Case: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలసానపల్లి గ్రామంలో ప్రైవేటు వ్యక్తికి చెందిన స్టోన్ క్రషర్ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆక్రమించి అధికారంలో ఉన్న వారు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే వారికి మద్దతుగా అధికారులు ఉండటం ఆందోళన కల్గిస్తోందని తెలిపారు. పలమనేరు నియోజక వర్గంలో కొలసానపల్లి గ్రామంలో 1.170 హెక్టార్ల భూమిలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్టోన్ క్రషన్ జనార్ధన్ నాయుడు మైనింగ్ లీజు కల్గి ఉన్నారని, 2020 జూన్ లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది మైనింగ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. యంత్రాలను, స్టోన్ క్రషర్ ను, టిప్పర్లను దౌర్జన్యంగా ఉపయోగించుకుంటూ.. గత రెడేళ్ల నుంచి కోట్ల రూపాయలు ఆర్జించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తన ఆస్తులను ఆక్రమించారని ఫిర్యాదుదారు జిల్లా ఎస్పీకి, విద్యుత్, మైనింగ్, రెవిన్యూ శాఖలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగమూ లేదని వాపోయారు. ఫిర్యాదు దారుడు అప్పుతో కొన్న వాహనాలకు వాయిదాలు చెల్లించనందున ఫైనాన్స్ కంపెనీలు కోర్టులో అతనిపై దావాలు వేశాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఆక్రమణ దారులు గత 22 నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించనందున బకాయిలు 25 లక్షల రూపాయల దాటి పోయాయన్నారు. క్రషర్ ఆక్రమణలో ఉందని, విద్యుత్ బిల్లులు కట్టనందున భవిష్త్ లో తనకు భఆరీ పెనాల్టీ పడే అవకాశం ఉన్నందున వెంటనే విద్యుత్ నిలిపివేయాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. 

విద్యుత్ నిలిపి వేయాలని విద్యుత్ శాఖపై హైకోర్టులో కేసు వేశారంటే రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. ఒకప్పుడు సుపరిపాలనకు పేరొందిన రాష్ట్ర అధికారులు ఇప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వాములు కావడం ఆందోళన కల్గిస్తోందన్నారు. పరిపాలన ఇలాగే కొనసాగి ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేక కోర్టులను ఆశ్రయించాలంటే సామాన్యుల జీవితం దుర్భరం అవుతుందని ఆక్షేపించారు. ఈ విషయమై విచారణ జరిపించి బాధితుడికి న్యాయం చేయాలని ప్రధాన కార్యదర్శిని కోరారు.  

గతంలో అక్రమ మైనింగ్ పై కూడా సీఎస్ కు లేఖ

News Reels

గతంలో ఇదే జిల్లాకుప్పం నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై.. ఎన్జీటీ ఆదేశాల అమలు కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు.. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నంబర్ 104, 213లలో అక్రమ మైనింగ్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునర్ ఇచ్చిన ఆదేశాలను లేఖకు జతచేశారు. గ్రానైట్ అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్ధారించిందని లేఖలో పేర్కన్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలన్న ఎన్జీటీ ఆదేశాలను ప్రస్తావించిన చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్ పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని తెలిపారు.  

Published at : 30 Oct 2022 10:29 AM (IST) Tags: AP News Chittoor News Chittoor Stone Crush Case Chandrababu Letter to CS Stone Crush Case

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

AP Politics : ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!

AP Politics :  ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

Nellore News : కాపీ కొట్టిందని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారా?, స్కూల్ ముందు విద్యార్థిని తల్లి నిరసన!

Nellore News : కాపీ కొట్టిందని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారా?, స్కూల్ ముందు విద్యార్థిని తల్లి నిరసన!

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్