News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chittoor News : తిరుపతిలో బైక్ ను వెంబడించిన ఏనుగుల గుంపు, గజరాజుల దాడిలో రైతు మృతి

Chittoor News : చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య ఎక్కువైంది. తిరుపతి పాపవినాశం వద్ద బైక్ పై వెళ్తున్న వారిని ఏనుగులు అడ్డగించాయి. జిల్లాలోని జోగివారి పల్లిలో నిద్రపోతున్న రైతును ఏనుగులు తొక్కి చంపేశాయి.

FOLLOW US: 
Share:

Chittoor News : తిరుమలలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఏనుగుల గుంపు తరచు రోడ్లపైకి వస్తూ భక్తులను భయాందోళనలకు గురిచేస్తుంది.  కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి శేషాచలం అటవీ ప్రాంతంవైపు  ఏనుగుల గుంపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాపనివాశనం వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఏనుగుల గుంపు రోడ్లపైకి వచ్చాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం రోడ్డులో తిష్ఠ వేసిన ఏనుగులు ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. ఆ మార్గంలో  బైక్ పై వస్తున్న వారిని ఏనుగులు దాడికి యత్నించాయి. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ రహదారిలో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి పంపేందుకు టీటీడీ, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఏనుగు దాడిలో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో సదుం మండలం జోగివారి పల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లికి చెందిన ఎల్లప్ప(38) గురువారం తెల్లవారుజామున రాత్రి పొలం వద్ద ఉండగా ఏనుగు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు రైతును వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రైతు ఎల్లప్ప మృతి చెందాడు.

Also Read : Chittoor: RRR చూసి ఇంటికి బయల్దేరిన యువకుడు, రెండ్రోజులైనా రాలేదు - కూపీ లాగితే సంచలన విషయాలు, అవాక్కైన పోలీసులు!

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య 

చిత్తూరు జిల్లా జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పంట పొలాలపై ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. జోగివారిపల్లె పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఎల్లప్ప(38) తోట వద్ద నిద్రపోతున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎల్లప్ప తలకు తీవ్ర గాయమైంది. అతడిని చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లప్పు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. జోగివారిపల్లె సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య ఇటీవల ఎక్కువైంది. కొన్ని రోజులుగా మామిడి తోటలను ధ్వంసం చేయడంతో పాటు పొలాల్లోని మోటార్లను నాశనం చేస్తున్నాయి. 

Also Read : AP High Court : ఏపీ హైకోర్టు సంచలన తీర్పు, 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

Published at : 31 Mar 2022 02:52 PM (IST) Tags: AP News Chittoor News elephants roaming Papavinashanam farmers died

ఇవి కూడా చూడండి

CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్

CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

BJP Vishnu :టిప్పుసుల్తాన్ విగ్రహ స్థానంలో పటేల్ స్టాట్యూ - దమ్ముంటే ఆపాలని వైసీపీకి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ !

BJP Vishnu :టిప్పుసుల్తాన్ విగ్రహ స్థానంలో పటేల్ స్టాట్యూ - దమ్ముంటే ఆపాలని వైసీపీకి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ !

Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

Pavan Babu Meet :    చంద్రబాబుతో పవన్ భేటీ -  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్

Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్

టాప్ స్టోరీస్

CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

CM  Revanth  :  మాట నిలబెట్టుకున్న రేవంత్ -  దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌

BRS News : అటు టిక్కెట్ రాలేదు ఇటు పదవీ ఊడింది - ఈ బీఆర్ఎస్ నేతలకు ఏడుపొక్కటే తక్కువ !

BRS News :  అటు టిక్కెట్ రాలేదు ఇటు పదవీ ఊడింది - ఈ బీఆర్ఎస్ నేతలకు ఏడుపొక్కటే తక్కువ !

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్
×