Chevireddy Mohith Reddy: తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సైతం
TUDA Chairman : తుడా ఛైర్మన్ పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు బాధేశాయని.. వచ్చే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
Chevireddy Mohith Reddy: తుడా ఛైర్మన్ పదవి తనను నమ్మి ఇచ్చిన వైఎస్ జగన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లలో నాన్న గారు, మా కుటుంబం అంతా ప్రజల కోసం కష్టపడ్డాం. ఏ రోజు ప్రజలు బాగుండాలి. మన వంతు కృషి మనం చేయాలి. వాళ్లు చివరి ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించారు. పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలన్న ఆలోచనతో కష్టపడ్డాం. కరోనా లాంటి కష్ట సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి గడపకు పోయి సుమారు ఒక సంవత్సరం పాటు.. బయటికి కొస్తే ఇబ్బందిపడతారని అన్నా కూడా నాన్న గారు, మా కుటుంబం ప్రజలను ఆదుకున్నాం. ప్రజాసేవ చేయడమే మాకు తెలుసు. గత ఐదేళ్లలో లో 980కోట్లరూపాయలతో చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించాం.
నియోజకవర్గ అభివృద్ధికి మా శక్తి వంచన లేకుండా కృషి చేశాం. 2022గడపగడప కు వైసీపీ కార్యక్రమం ద్వారా 1620కిలోమీటర్లు తిరిగాం, ప్రతి ఇంటికి వెళ్లి కష్టసుఖాలు తెలుసుకున్నాం. ప్రజలకు సేవ చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. కానీ ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు చూస్తే బాధేసింది. ప్రజా తీర్పును శిరసా వహిస్తాం. మా పార్టీ కార్యకర్తలు అందరికీ అండగా ఉంటాను. నా వెంట నడిచిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను. వారికి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటాము. వారికి ఏ ఆపద వచ్చిన ఆండగా నిలుస్తాము. లక్ష ఓట్లు వేసిన మా నియోజకవర్గం ప్రజలకు అండగా నిలుస్తాను.’ అని మోహిత్ రెడ్డి తెలిపారు.
పులివర్తి నానికి శుభాకాంక్షలు
చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఎన్నికైన పులివర్తి నాని కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రగిరి నియోజక ప్రజలకు అండగా నిలుస్తానన్నారు. చిన్న వయసులో తుడా ఛైర్మన్ ఇచ్చిన సిఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబం ఎక్కడికి వెళ్లదని స్పష్టం చేశారు. తన పార్టీ కార్యకర్తలపై దాడి జరుగుతుండడం బాధాకరమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తుడా ఛైర్మన్, టిటిడి ఎక్స్ అఫిషియో సభ్యత్వం కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేము గెలుపు ఓటమి వచ్చినా ఒకేలా ఉన్నామని. వచ్చే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో గెలుస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.