అన్వేషించండి

Chandrababu : ప్రాజెక్టుల నిర్మాణంలో కోస్తాకు ద్రోహం - ఖర్చుపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ !

కోస్తాంధ్ర ప్రాజెక్టులను సీఎం జగన్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టుల ఖర్చుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ల


Chandrababu :   సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఖరిని వెల్లడించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు గురువారం కోస్తాంధ్ర ప్రాజెక్టుల గురించి వివరించారు.  ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 780 కోట్లు కేటాయించి.. రూ. ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. తన సొంత కేసుల్లో గెలుస్తున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టుల కేసుల్లో మాత్రం ఓడిపోతున్నారని ఎద్దేవా చేశారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే కనీసం రిపేర్లు చేయించలేదన్నారు. 

వైసీపీ సర్కార్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది చాలా తక్కువ !

తెలుగుదేశం పార్టీ హయాంలో కోస్తాంధ్రలో ప్రాజెక్టుల కోసం రూ. 21, 442 కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ వైసీపీ హయాంలో  కేవలం రూ. 4375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. ఇది కూడా నిర్వహణ ఖర్చుల కోసమేనని.. నిర్మాణాలన్నీ పడకేశాయన్నారు. ప్రాజెక్టులను అలా వదిలేసి ప్రజాద్రోహం చేశారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ప్రాజెక్టుల్లో నాలుగు శాతం పనులే చేయడం సిగ్గు చేటన్నారు. కోస్తాంధ్ర ప్రరిధిలో 96 ప్రాజెక్టుల పనులు టీడీపీ హయాంలో ప్రారంభిస్తే వైసీపీ వచ్చాక వాటన్నింటినీ ప్రి క్లోజర్ చేశారన్నారు. పోలవరం కుడి కాలువ మట్టిని  దోచుకున్నారన్నారు. ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు.ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే.. నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు.. వీటి కింద అనేక నదులు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. వంశధార - గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చు.. కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.   
 
నదుల అనుసంధానం ముఖ్యం 
 
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పడకేశాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకుండా, కమీషన్ల కక్కుర్తితో టెండర్లు పిలిచించి.. తనకు కావలసిన కాంట్రాక్టర్లకు   వందల కోట్ల రూపాయలు చెల్లించారని  ఆరోపించారు.  ప్రీ క్లోజర్‌ చేస్తూ, అయిదేళ్లపాటు టెండర్లే పిలవకూడదంటూ జీవో జారీ చేశారన్నారు.   ప్రెస్ మీట్ పెడుతున్నానని.. ప్రాజెక్టులపై సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారని తెలిపారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించారన్నారు. ‘‘ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కానీ.. అంబోతులా అరుస్తాడు తప్ప ఏం చేయడు..?. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే ఉంది. ఈ ఏడాది చివర్లో ఏదో ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తారట. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు..?’’ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలని చెత్త ప్రభుత్వమన్నారు. 

జగన్ కిమ్ బ్రదర్ !      

జగన్ రెడ్డి  పేదలకు పెత్తందార్లుకు పోరాటం అంటూ స్లోగనర్లు ఇస్తున్నారని...  ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే పేదలకు మేలు జరిగేది కదా అని ప్రశ్నించారు.  స్లోగన్లు వద్దని సలహా ఇచ్చారు.  ఓ పక్క దోచుకుంటూ.. మరో పక్క స్లోగన్లు ఇస్తారా అని ప్రశ్నించారు.  ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేసి కూడా అనవసరమన్నారు.  టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్మాణంపై టైమ్ బాండ్ ప్రొగ్రాం పెట్టుకుని పని చేస్తామని ప్రకటించారు. జగన్ రెడ్డి కిమ్  బ్రదర్ అని.. ప్రజల్ని నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారని సెటైర్ వేశారు.  ఇంత కన్నా చెత్తగవర్నమెంట్ ఎక్కడా లేదన్నారు.  బటన్ నొక్కితే అమ్మఒడి వెళ్తోందా అని ప్రశ్నించారు. రూ. పదహేను వేలన్నారు..త త్రవాత  రూ. 13 వేలు ఇస్తున్నామంటూ బటన్ నొక్కి.. రూ. 5 వేలు వేస్తారా..? అని ప్రశ్నించారు.  జగన్ను నొక్కేది ఉత్తుత్తి బటనే.  అసలు బటన్ సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్సులో నొక్కుతాడని మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
TTD Adulterated Ghee Case: టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget