Kuppam Chandra Babu House : కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు - నేరుగా ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ఏర్పాట్లు !
కుప్పంలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు. ఇక నుంచి నేరుగా కుప్పం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తానే స్పందించాలని నిర్ణయించుకున్నారు.
![Kuppam Chandra Babu House : కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు - నేరుగా ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ఏర్పాట్లు ! Chandrababu is building his own house in Kuppam. Kuppam Chandra Babu House : కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు - నేరుగా ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ఏర్పాట్లు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/20/c251fe3b058426b53f2db05f5f87cc8c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా పేరుందిన నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. దశాబ్దాలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఇల్లు కూడా నిర్మించుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార పార్టి నేతలకు బుద్ది చేప్పే విధంగా ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇకపై కుప్పం వాసిగా మారబోతున్నారు. ఆరు దఫాలుగా కుప్పం ప్రజలను నమ్ముకుని ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కుప్పంలో ఇల్లు నిర్మించుకోలేదు. దీంతో ఆయన కుప్పంలో ఇంటి నిర్మాణం వైపు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి అన్ని పనులు చకచక సాగుతున్నాయి.
జగన్, చిరు, పవన్ - చంద్రబాబుకు పుట్టిన రోజు విషెష్ చెప్పిన ప్రముఖులు!
ఏళ్ళ తరబడి కుప్పం ప్రజలతో చంద్రబాబు నాయుడుకి ఎంతో అనుబంధం ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పంగా రాష్ట్రంలోనే కాదు..దేశంలోనూ నానుడి.. అందుకే ఇకపై తనే ప్రజలకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్న బాబు కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని రోడ్డు ప్రక్కనే భూమిని కొనుగోలు చేశారు. అంతే కాకుండా కొనుగోలు చేసిన భుమిలో ఇంటిని నిర్మించనున్నారు. ఈ నెల చివరిలో కుప్పంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలోనే భూమి పూజ చేసి ఇంటి పనులు ప్రారంభించనున్నారు. ఇంటి నిర్మాణంతో పాటుగా కుప్పం రాజకీయాలపై కూడా బాబు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తమ కుటుంబంలో ఒకరిని ఇక్కడ పెట్టి పార్టి వ్యవహారాలను స్వయంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్ వద్దకు నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ పంచాయతీ ! ఇక సర్దుకున్నట్లేనా ?
ఇంత వరకూ కుప్పం భాధ్యతలను పీఏలకు అప్పగించిన బాబు ఇకపై వారిపై ఆధారపడకుండా పర్సనల్ గా ప్రజలతో టచ్ లో ఉండేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తొంది.. కుప్పం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనే ఆ సమస్యను నేరుగా పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా భాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా ఉండే బాబు కుప్పం భాధ్యతలను స్ధానిక పార్టి నాయకులపై ఉంచారు. అయితే ఇటీవల్ల ఎదురైన పరిమాణాల దృష్ట్యా అధికార పార్టి నాయకులకు తలొగ్గారంటూ చంద్రబాబు స్ధానిక నాయకులపై తీవ్రంగా మండిపడ్డిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కుప్పం ప్రజలకు దగ్గర అయ్యే విధంగా చంద్రబాబు యోచించడంతో మరింతగా కుప్పం టిడిపి వర్గాల్లో కొత్త ఊపు రానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)