News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nitin Gadkari: చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు.

FOLLOW US: 
Share:

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మచ్చలేని ప్రజా సేవకుడు అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీ కేశినేని నానితో గడ్కరీ గురువారం (సెప్టెంబరు 21) మాట్లాడారు. అనంతరం చంద్రబాబు యోగక్షేమాల గురించి గడ్కరీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.... చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు అని గడ్కరీ  చెప్పినట్లు ఎంపీ కేశినేని నాని పేట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు అరెస్టుపై పలువులు నేతల ఆరా.... 
చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈనెల 19వ తేదీన తర్వాతనే బయటకు వస్తారని ఊహాగానాలు వచ్చినా కానీ దీనిపై స్పష్టత లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు పైన భిన్నభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై పలువురు కీలక నేతలు ఆరా తీస్తున్నారు.

కేంద్రం అరెస్టుపై స్పందించాలి...
చంద్రబాబు అరెస్టుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం స్పందించకపోవడం పైన టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రంలోని ముఖ్యుల మద్దతు ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. వామపక్ష నేతలు ఇవే రకమైన ఆరోపణ చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయిన రోజునే తాను పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి ఏపీలో పరిణామాల పైన చర్చించానని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. దీని పైన నడ్డా తనకు సమాచారం ఉందని తెలిపారని వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగా, రాజకీయ కారణాలో అరెస్ట్ చేసారని.. పార్టీ నేతలంతా ఖండించాలని సూచించారని సీఎం రమేష్ చెప్పారు. సీబీఐ ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చి వైసీపీ నేతలను విచారణ చేసిందని..కానీ, ఎఫ్ఐఆర్ లో పేరు లేని చంద్రబాబుకు నోటీసులివ్వకుండానే అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్ట్ బీజేపీకి తెలిసే జరిగిందన్నది అబద్దమని చెప్పారు. ఈ అరెస్ట్ రాష్ట్ర పరిధిలోని సీఐడీ తప్పితే కేంద్రం ఆధ్వర్యంలోని సీబీఐ కాదని వివరించారు.

ఇదే సమయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాలయ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో పరిస్థితి ఢిల్లీ పెద్దలకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వారి ఆశీర్వాదం లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయించే ధైర్యం జగన్ చేయగలరా అని నిలదీసారు. దీంతో ఈ పరిణామాలు పొత్తుల పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ మిత్రపక్షంగా.. ఇటు టీడీపీ తో సన్నిహితంగా కొనసాగుతున్న పవన్ పాత్ర కీలకంగా మారుతోంది.

కేంద్ర ప్రభుత్వం లోని కొందరు కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆరా తీస్తున్న కానీ...  కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు రావడంలేదని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నారు. అరెస్టుపై కేంద్రానికి సమాచారం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చంద్రబాబు అరెస్టుపై ఆరా తీయడం పై ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Published at : 21 Sep 2023 08:51 PM (IST) Tags: Gadkari Central minister

ఇవి కూడా చూడండి

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ -  ఎందుకంటే ?

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

టాప్ స్టోరీస్

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి  బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !