![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu:వన్ సైడ్ లవ్ కాదు.. రెండు వైపులా ఉండాలి.. ఏకపక్ష లవ్ సరికాదు.. కుప్పంలో చంద్రబాబు
మూడు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Chandrababu:వన్ సైడ్ లవ్ కాదు.. రెండు వైపులా ఉండాలి.. ఏకపక్ష లవ్ సరికాదు.. కుప్పంలో చంద్రబాబు chandrababu In Kuppam Tour Chandrababu:వన్ సైడ్ లవ్ కాదు.. రెండు వైపులా ఉండాలి.. ఏకపక్ష లవ్ సరికాదు.. కుప్పంలో చంద్రబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/7f53852b15f7c5f27d20525b3969a15f_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తాను.. కుప్పం వదిలిపెడతానని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని.. చంద్రబాబు అన్నారు. ఇవాళ రాత్రికి కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహంలో చంద్రబాబు బసచేస్తారు. 7న కుప్పం మండలంలోని పలు గ్రామాలు, 8న రామకుప్పం మండలంలోని గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. కుప్పం పర్యటన కోసమని.. అంతకుముందు.. ఇవాళ ఉదయం విమానంలో అమరావతి నుంచి బెంగుళూరుకు వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు.
రామకుప్పం మండలం అరిమానపంట సభలో చంద్రబాబు మాట్లాడారు. పండుగలను జరుపుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. నూతన సంవత్సరం రోజు 144కోట్ల మద్యం తాగేశారని.. మోసకారి జగన్ ను నమ్మొద్దని విమర్శించారు. కర్ణాటకలో ఇసుక దొరుకుతుంది..కుప్పంలో దొరకదన్నారు. మూడు సంవత్సరాల్లో మూడు ఇళ్లు కూడా కట్టని వ్యక్తి జగన్ అని విమర్శించారు.
జనసేన పొత్తుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా.. లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులా ఉండాలని వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుప్పంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పర్యటన, టిడిపి కార్యకర్తలతో చంద్రబాబు గారి సమీక్ష సమావేశం - ప్రత్యక్ష ప్రసారం. https://t.co/Myu4p6CIzc
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 6, 2022
'పార్టీకి నష్టం కలిగించేవారిని వదిలిపెట్టను. నాపై నమ్మకంతో నా వెంట నడిచే వారికి అండగా ఉంటా. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బాధ కలిగించింది. డబ్బులు వెదజల్లి, బెదిరించి ఓట్లేయించుకున్నారు. ఓటిఎస్ కట్టని వారిని భయపెడుతున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా. కుప్పంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు..?' అని ప్రశ్నించారు.
Also Read: Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. తగ్గినట్టే కనిపించి ఎక్కువవుతున్న కేసులు
Also Read: Nellore Crime: ఈ చోరుడు మహా ముదురు... పోలీసు స్టేషన్ లోనే దొంగతనం... పోలీసుల కన్నుగప్పి బైకులు చోరీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)