TDP Parliamentary Party Meet : టీడీపీ ఎంపీలకు ఢిల్లీలో స్పెషల్ టాస్క్ - అందరికీ శాఖల పంపకం
Andhra Pradesh : కేంద్రం నుంచి నిధులు తీసుకు వచ్చేలా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలకు శాఖలు కేటాయించి ఆ శాఖల వారీగా కేంద్రమంత్రుల్ని కలిసి ఫాలో అప్ చేసుకోవాలన్నారు.
TDP MPs : జులై 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎంపీలకు వివరించారు. వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని దిశానిర్దేశం చేశారు.
ఎంపీలకు మంత్రిత్వ శాఖలు కేటాయించిన చంద్రబాబు - ఫాలో అప్ చేసుకోవాలని సూచన
కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై ఎంపీలకు చంద్రబాబు ప్రత్యేకమైన సూచనలు చేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు అప్పగించారు.ఆ ఎంపీలు తరచూ ఆయా కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర ప్రాజెక్టులను ఫాలో అప్ చేయాలన్నారు.
కేంద్ర నిధుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశం
కేంద్ర ప్రాయోజిత పతకాలకు ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉందని వాటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా దిశానిర్దేశం చేశారు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడంపైనా అధికారులవద్ద నుంచి సమాచారం తీసుకుని సభ్యులకు ఇచ్చారు. కేంద్ర సంస్థలకు భూములు కావాలంటే.. వేగంగా ఇస్తామని చెప్పాలన్నారు.
జగన్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు
జగన్ ఢిల్లీలో చేస్తానని చెప్పిన ధర్నాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. ల . జగన్ గురించి, వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని .. సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చిస్తే మేలు జరుగుతుందని ఎంపీలు చెప్పారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో అనేది ఇప్పుడు ముఖ్యం కాదని.. మనం ఏం చేయాలనేదే ముఖ్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ అంశాన్ని వదిలేసి.. రాష్ట్రం గురించి ఆలోచించాలని సూచించారు.
పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు పన ిచేస్తామని ప్రకటించారు. జనగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.