By: ABP Desam | Updated at : 13 Sep 2023 03:05 PM (IST)
బెయిల్ పిటిషన్ వేయని చంద్రబాబు - వ్యూహాత్మకమేనా ?
Chandrababu Case : స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో స్కాం జరిగిందని రెండేళ్ల కిందట నమోదు చేసిన కేసులో రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి.. తర్వాత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోుద చేశారు. ఆ రిమాండ్ రిపోర్టులో అసలు విషయమే లేదని దాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిజెక్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లారు. హౌస్ రిమాండ్‌కూ కోర్టు అనుమతించ లేదు. నిజానికి ఇలాంటి కేసుల్లో రిమాండ్ కు పంపగానే ఎవరైనా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయేలదు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఇతర కేసుల్లో బెయిల్ పిటిషన్ల వేశారు కానీ తాను అరెస్టయిన కేసులో మాత్రం బెయిల్ పిటిషన్ వేయలేదు.
ప్రభుత్వానిది తప్పుడు కేసును నిరూపించాలనే లక్ష్యంతోనే జైల్లో!
బెయిల్ కు దరఖాస్తు చేసుకుని బయటకు వస్తే.. చంద్రబాబు బెయిల్ ఉన్నారని ప్రచారం చేస్తారు. ఆ కేసు ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఆ కేసు పెట్టి కొంత మందిని అరెస్ట్ చేసి రెండేళ్లు గడిచినా చార్జిషీటు వేయలేకపోయారు. అసలు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పలేకపోయారని టీడీపీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై నమోదు చేసిన అభియోగాలు, సెక్షన్లు చెల్లవని. పైగా అరెస్టు కూడా అక్రమం అని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న రిమాండ్ రిపోర్టును హైకోర్టు తిరస్కరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
ప్రభుత్వంపై క్యాడర్ అంతా ప్రజల్లోకి !
మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబును కావాలనే అరెస్ట్ చేశారని.. తప్పుడు కేసులో ఇరికించారని ప్రజల నుంచి మద్దతు పొందడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతివ్వాలని కోరతూ క్యాంపెయిన్ ప్రారంభించింది. నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆత్మహత్య చేసుకున్న.. గుండెపోటుతో చనిపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర తరహాలో ఓ ప్రచారాన్నీ ప్లాన్ చేయబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా నష్టపోయిన తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వారందరినీ ప్రజల ముందుకు తెచ్చి ఏపీలో అధికారం ఎలా దుర్వినియోగం అవుతుందో చూపించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు రాజకీయ వ్యూహాలు వైసీపీకి షాక్ నిస్తాయా ?
క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం ప్రభుత్వం వారం రోజుల సమయం అడగడం.. అప్పటికి కౌంటర్ వేస్తామని చెప్పడంతో.. తెలుగుదేశం పార్టీ నేతలు మరింతగా ఎదురుదాడి చేస్తున్నారు. అన్ని ఆధారాలున్నాయని చెప్పి అర్థరాత్రి అరెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ఆధారాలు చూపించడానికి.. కౌంటర్ దాఖలు చేయడానికి ఎందుకు సమయం అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. క్వాష్ పిటిషన్‌పై విచారణలో ప్రభుత్వం తరపు లాయర్ ఆధారాలు చూపించకుండా పారిపోయారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు జైల్లోనే ఉండటం వల్ల క్యాడర్ అంతా రోడ్ల మీదకు వస్తుందని.. తనను అక్రమంగా జైల్లో పెట్టారన్న సానుభూతి కూడా వెల్లువెత్తుతుందన్న నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది. అందుకే బెయిల్ పిటిషన్‌పై చంద్రబాబు ఇంకా ఎలాంటి ఆలోనచ చేయేలదని అంటున్నారు.
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!
TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత
AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన
విజయవాడ దుర్గగుడి ఈవోగా శ్రీనివాసరావు నియామకం, భ్రమరాంబపై వేటు!
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
/body>