అన్వేషించండి

Social Media Cases CBI : ఏపీలో న్యాయవ్యవస్థపై జరిగిన కుట్ర ఏంటి..? సీబీఐ ఎప్పట్లోపు తేల్చబోతోంది.?

హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయని గత ఏడాది ఓ పార్టీ మద్దతుదారులు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లు పెట్టారు. వాటిపై సీబీఐ విచారణ వేగం పుంజుకుంటోంది.


" న్యాయమూర్తుల్ని శారరీకంగానే కాదు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మానసికంగా వేధిస్తున్నా... అలాంటి కేసుల విషయంలో సీబీఐ, ఐబీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని" సాక్షాత్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ .. జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణలో అసంతృప్తి వ్యక్తం చేశారు.  సీజేఐ అసంతృప్తితో సీబీఐలో కాస్త కదలిక వచ్చినట్లుగా రెండు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్ల కిందట హైకోర్టు న్యాయమూర్తులు టార్గెట్‌గా సోషల్ మీడియా వ్యతిేక ప్రచారంలో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. అదే సమయంలో ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపింది. మొత్తంగా ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.   

జడ్జిలపై దారుణ విమర్శలు చేసిన ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు..! 

2020 మే నెలలో హైకోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. ఎంపీ నందిగం సురేష్ మే 22వ తేదీన వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి.. హైకోర్టులో న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులు చంద్రబాబుకు ముందే తెలిసిపోతున్నాయని.. అలా ఎలా తెలుస్తున్నాయని..తక్షణం చంద్రబాబు కాల్ లిస్ట్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో న్యాయమూర్తుల్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అలా కొన్ని వందల పోస్టులు పెట్టారు. వాటిలో కొన్ని న్యాయమూర్తుల్ని చంపుతామనే హెచ్చరికలతో ఉన్నాయి. తర్వాత కొంత మంది ప్రజాప్రతినిధులు..మాజీ ప్రజాప్రతినిధులు కూడా అవే తరహా వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై ఒక్క సారిగా మూకుమ్మడి దాడి చేసినట్లుగా ఉండంటంతో వాటిపై హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

సీఐడీ విచారణ చేయకపోవడంతో  సీబీఐకి ఇచ్చిన హైకోర్టు..!

రెండు విడతలుగా మొత్తంగా 90 మందిపైగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివసరావు లాంటి వారు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈ కేసులను సీరియస్‌గా తీసుకోలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నేతలపై ఎవరైనా తెలుగుదేశం మద్దతుదారులు వ్యతిరేక పోస్టులు పెడితే అర్థరాత్రి కూడా వెళ్లి అరెస్ట్ చేసే సీఐడీ అధికారులు న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదు. దీంతో  హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 12వ సీబీఐకి ఈ కేసులను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

నెమ్మదిగా సీబీఐ విచారణ... రెండు రోజుల కిందట సీజేఐ అసంతృప్తి..! 

సీబీఐ కేసును స్వాధీనం చేసుకుంది కానీ విచారణ చురుగ్గా చేయలేదు. డిసెంబర్‌లో హైకోర్టులో కేసు విచారణకు నాలుగు నెలల సమయం పడుతుందని పిటిషన్ వేసి.. సమయం తీసుకున్నారు. నాలుగు నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేదు. ఎప్పటికప్పుడు మరింత సమయం పడుతుందని కోర్టుకు చెబుతూ వస్తున్నారు. మధ్యలో ఓ సారి ఆమంచి కృష్ణమోహన్‌కు నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు.  ఆ తర్వాత్ అతీ గతీ లేదు. ఇటీవల ఈ కేసులో సీబీఐ నిందితుల జాబితాలో 18వ స్థానంలో ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఆదివారంతో మొత్తంగా ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్‌కు నోటీసులు జారీ చేసి.. పిలిపించి ప్రశ్నించారు. ఇప్పటి వరకూ కేసు విషయంలో జరిగిన పురోగతి ఇదే. అదీ కూడా సీజేఐ ఆగ్రహం తర్వాతే కాస్త కేసు ముందుకు కదులుతోంది. 

ఆ "భారీ కుట్ర"ను సీబీఐ  వెలుగులోకి తెస్తుందా..? 

న్యాయస్థానాలపై దేశంలో ఎప్పుడూ .. ఎక్కడా జరగనంతగా దాడి అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని న్యాయనిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి అనుకూల తీర్పులు రాకపోతే.. దేనికైనా వెనుకాడబోమన్న హెచ్చరికలు పంపడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారని.. ఇలాంటి పోకడల్ని అరికట్టకపోతే.. న్యాయవ్యవస్థ ఉనికికే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. అయితే సీబీఐ మాత్రం... ఈ కేసులో ఇప్పుడు.. ఆ సోషల్ మీడియా పోస్టుల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. అలాంటిది ఉన్నప్పుడు సీబీఐ మరింత చురుకుగా వ్యవహరించి ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడటానికి ప్రయత్నించాల్సి ఉంది. కానీ ఆలస్యం చేస్తూనే ఉంది. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో.. సీబీఐ చెప్పిన ఆ భారీ కుట్ర బయటకు వస్తుందో లేదో వేచి చూడాలి..!  
      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget