YS Jagan Bail Live Updates: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. వచ్చే నెల 15కి తీర్పు వాయిదా
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆయన బెయిల్‌ను కోర్టు రద్దు చేస్తుందా? లేక కొనసాగిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? కొనసాగుతుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై నేడు (ఆగస్టు 25) కోర్టు తీర్పు ఇవ్వనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు కొద్ది వారాల క్రితమే ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను వేగంగా విచారణ జరపాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ రద్దు పిటిషన్‌పై జులై ఆఖరులో వాదనలను ధర్మాసనం పూర్తి చేసింది. తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు తీర్పు వెలువడనున్నందున సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తీర్పు వచ్చే నెల 15కి వాయిదా
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. సెప్టెంబర్ 15కి తీర్పు వాయిదా వేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘించారంటూ వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 4న సీబీఐ కోర్టులో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మరోసారి కోర్టులో విచారణ జరిగింది.
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు
వైఎస్సార్ సీపీ ఎంపీ, రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి.
కడిగిన ముత్యంలా బయటికి రావాలి
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రెబల్ ఎంపీ రఘురామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి తమ నాయకుడు వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌పై నమోదైన బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేస్తుందని, ఈ నెలఖారులో ఆయన విదేశాలకు వెళ్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూద్దామని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు.
కడిగిన ముత్యంలా బయటకు రావాలి: ఎంపీ రఘురామకృష్ణరాజు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నట్టు ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా జగన్ కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని అన్నారు. కేసులను వాయిదా వేసేందుకు న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుందని తెలిపారు. జగన్ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు రావాలనేది తన కోరికని చెప్పారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని తెలిపారు. కోర్టు తీర్పు కోసం వేచి చూద్దామని అన్నారు.