Cases On TDP leaders : కృష్ణా జిల్లా కీలక టీడీపీ నేతలందరిపై హత్యాయత్నం కేసులు - భయపెట్టలేరన్న దేవినేని ఉమ !
పాదయాత్రలో జరిగిన ఘర్షణ ఘటనలో కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలందరిపైనా హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కేసులకు భయపడేది లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
Cases On TDP leaders : న్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం ఘర్షణ ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నాయకులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కేసుల్లో దాదాపు 50 మందితో పాటు ఇతరులు అని కేసులు పెట్టారు. అమెరికాలో ఉన్న ఆళ్ల గోపాలకృష్ణ అనే వ్యక్తి రంగన్నగూడెం ఘర్షణలో పాల్గొన్నారని కేసులు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గన్నవరం టీడీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావును ఏ1గా చేర్చుతూ దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ పేర్లనూ ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. గన్నవరం టీడీపీ కీలక నేతలే లక్ష్యంగా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
లోకేశ్ పాదయాత్ర సక్సెస్ చూసి వైసీపీ నేతల్లో భయం పట్టుకుందని.. పోలీసుస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు మాపై కేసు పెట్టారని.. – ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామన్నారు. అమెరికాలో ఉన్న నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారన్నారు. యార్లగడ్డ ఇన్‌ఛార్జిగా వచ్చిన 24 గంటల్లోనే 3 కేసులు పెట్టారని తప్పుడు కేసులకు భయపడేది లేదని దేవినేని ఉమ స్పష్టం చేశారు. 16 నియోజకవర్గాల్లో వైసీపీకి డిపాజిట్ లేకుండా చేసి టీడీపీ దెబ్బ చూపిస్తామని టీడీపీ నేతలు మండిపడ్డారు. కొడాలి నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క .. స్వార్ధం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తాడన్నారు. చివరికి జగన్ కి ద్రోహం చేస్తాడని విమర్శించారు. ఓటమి భయం వైసీపీ నేతల మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుందని.. అందుకే మా మీద కేసులు పెడుడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. మా మీద కేసులు భయపడే పరిస్థితి లేదన్నారు. బందరు పిచ్చోడు ఏదో వాగుతున్నాడని.. వైసీపీ ఖాళీ.. టీడీపీలోకి నేతలు వలస వస్తున్నారన్నారు.
ఎన్నికల సమయంలో బ్లాక్ మెయిల్ చేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెడుతున్నరని.. ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేకే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో సంస్కార హీనులుగా మిగిలిపోతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. కొందరు పోలీసులు ఖాకీ చొక్కా తీసి వైసీపీ చొక్క వేసుకున్నారన్నారు. అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్న కొందరు పోలీసుల పేర్లను లోకేశ్ రెడ్ బుక్ లో రాసుకున్నారు.. అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిన్న వీరవల్లి పీఎస్ లో ఒకేసారి ఫిర్యాదు చేస్తే.. మా ఫిర్యాదుపై కేసులు ఎందుకు పెట్టలేదు? – వైసీపీ పని అయిపోయింది అందుకే కేసుల ద్వారా భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
మరో వైపు యువగళం గన్నవరం సభలో ప్రసంగాలపై కేసులు నమోదు చేశారు. నా తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయని లోకేష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో? చెప్పాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి చేసినవని వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
యువగళం సభలో నేను, మా టిడిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నా తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయో! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక… pic.twitter.com/le1Yf0D8Yw
— Lokesh Nara (@naralokesh) August 25, 2023