Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అతడు ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించాడని తేలడంతో అంతా షాకవుతున్నారు.

Andhra Pradesh News: బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టును తప్పుదారి పట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. గడువు ముగియడంతో మరోసారి తల్లికి అనారోగ్యం కారణం చూపించి రెండోసారి బెయిల్ తెచ్చుకున్నాడు. అనుమానం వచ్చి చెక్ చేయగా అది ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైకోర్టు బెల్ మంజూరు చేసిన తర్వాత డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో చెక్ చేయకుండా బూరుగడ్డ అనిల్ కుమార్ ను అంత ఈజీగా ఎలా రిలీజ్ చేశారని విమర్శలు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
వైసిపి హయాంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వారి కుటుంబాలు టార్గెట్ గా గుంటూరుకు చెందిన బూరుగడ్డ అనిల్ కుమార్ చెలరేగిపోయాడు. బోరుగడ్డపై ఏపీవ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయత్నం చేసిన కేసులో అరండల్ పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పలు కేసుల్లో బోరుగడ్డ అనిల్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ అనంతపురం సిటీ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎలాంటి బెయిల్ మంజూరు కాలేదు.
తల్లికి అనారోగ్యం పేరుతో బోరుగడ్డ డ్రామా!
ఈ క్రమంలో తన తల్లి పద్మావతికి అనారోగ్యంగా ఉందని ఆమె గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని చికిత్స చేయించేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న హైకోర్టుకు వెళ్ళాడు. తల్లి పద్మావతికి ఉన్న అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ సైతం సబ్మిట్ చేశాడు. బోరుగడ్డ అనిల్ పిటిషన్ లంచ్ మోషన్ గా స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి నిందితుడికి ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటల వరకు లొంగిపోవాలని సైతం ఆదేశాలలో పేర్కొన్నారు. సరిగ్గా బెయిల్ గడువు ముగియగానే బోర్ గడ్డ అనిల్ రాజమండ్రి జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోయాడు.
ఫేక్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన బోరుగడ్డ అనిల్
తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నైలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించాలని మార్చి 1న హౌస్ మోషన్ పిటిషన్ వేశాడు. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పీవీ రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన తరపు లాయర్ ఈ సర్టిఫికెట్ను కోర్టులో సబ్మిట్ చేసి బరుగడ్డ అనిల్ కుమార్ మద్యంతెర బెయిల్ పొడిగించాలని రిక్వెస్ట్ చేశారు. పద్మావతికి సంతానం పిటిషనర్ ఒక్కడే అని తల్లి చికిత్స కోసం బోరుగడ్డ అనిల్ కు బెయిల్ పొడిగించాలని వాదనలు వినిపించారు.
మార్చి 11 వరకు మద్యంతర బెయిల్ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఆరోజు సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండ్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించారు. అయితే గుంటూరులో కార్డియాలజిస్ట్ పెద్ద పెద్ద కేసులను సైతం పరిష్కరించారని, చెన్నై అపోలో హాస్పిటల్ కు ఎందుకు రిఫర్ చేశారా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. బోరుగడ్డ అనిల్ కుమార్ తనకు బెయిల్ కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశాడని తేలింది. అనంతపురం పోలీసులు కోరడంతో గుంటూరు పోలీసులు స్థానిక హాస్పిటల్ కు వెళ్లి ఆరా తీయగా అదంతా కట్టుకథ, ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. చీఫ్ కార్డియాలజిస్ట్ రాఘవశర్మ నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. దాంతో గుంటూరు పోలీసులు, అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్విచ్ఛాఫ్ వస్తోందని.. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

