Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
Anantapur: అనంతపురంలో నమోదైన కేసుల కారణంగా అక్కడికి బోరుగడ్డ అనిల్ ను తరలిస్తున్నారు. సమాజంలో అశాంతి సృష్టించేలా ప్రముఖులపై వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసులు నమోదయ్యాయి.
Borugadda Anil is being shifted To Aantapur: నందమూరి హరికృష్ణ హీరోగా వచ్చిన సీతయ్య సినిమాలో ఓ విలన్ ను పోలీసులు పట్టుకుంటారు. పవర్ ఫుల్ అయిన ఆ విలన్ కుటుంబసభ్యులు అతన్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే అక్కడ ఉండరు. వారు వచ్చే ముందే వేరే పోలీస్ స్టేషన్ కు తరలించేస్తూ ఉంటారు. బోరుగడ్డ అనిల్ అనే సోషల్ మీడియా అబ్యూజర్ విషయంలో పోలీసులు అదే వ్యూహం పాటిస్తున్నారు. ఆయనపై ఎక్కడెక్కడ కేసులు నమోదైతే అక్కడకు తీసుకెళ్లి అరెస్టు చూపిస్తున్నారు.
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనపై అనంతపురం లోనూ కేసులు నమోదయ్యాయి. నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు అయ్యాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు, జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని . సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ సమాజంలో అశాంతి సృష్టించే విధంగా కుట్ర చేసిన బోరుగడ్డ అనిల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. Cr.No.179/2024 u/s 79, 351 (2), 196 BNS-2023 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.
Also Read: వైజాగ్ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ కేసు తూచ్ - అందులో డ్రై ఈస్ట్ మాత్రమే ఉందని నిర్దారించిన సీబీఐ
అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ పై సెక్షన్ 79,351/2,196 bns కింద కేసును నమోదు చేశారు. ఈ కేసుల్లో మూడు రోజులపాటు అ కస్టడీకి ఇచ్చింది అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు. కస్టడీకి తీసుకుని రాజమండ్రి నుంచి అనంతపురం కు బోరుగడ్డ అనిల్ ను తరలించి ప్రశ్నించనున్నారు. బోరుగడ్డ అనిల్ పోలీసులకు కూడా లంచాలిచ్చి రాచమర్యాదలు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.