పుష్ప 2 తో తారక్ టాలీవుడ్ లో జెండా పాతేయడం పక్కా!

జాతరే...

థియేటర్లలో పుష్ప 2 జాతర నడుస్తోంది..బన్నీ ఊరమాస్ అవతార్ చూసి ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు.

పాజిటివ్ టాక్

ఓవరాల్ గా మూవీపై పాజిటివ్ టాక్ వచ్చేసింది..వాట్ నెక్స్ట్ అంటే ఇక కలెక్షన్ల లెక్కలు చూసుకోవడమే

హైలెట్

ఈ మూవీలో స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ హైలెట్ గా నిలిచిన క్యారెక్టర్స్ లో ఒకడు తారక్ పొన్నప్ప

అరగుండు నటుడు

థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న జాతర ఎపిసోడ్ లో అరగుండుతో కనిపించాడు తారక్ పొన్నప్ప.. ఇది ట్రైలర్లో కూడా ఉంది

ఎఫెక్టివ్ విలనిజం

సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డిగా నటించిన జగపతిబాబు తమ్ముడి కొడుకుగా నటించిన తారక్ పొన్నప్ప విలనిజం ఎఫెక్టివ్ గా చూపించాడు

నటనకు ఫిదా

ఆ క్యారెక్టర్లో తారక్ పొన్నప్పను చూస్తే ప్రేక్షకులకు చంపేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది..అంతలా ఒదిగిపోయాడు

పుష్పరాజ్ తో ఢీ

ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర బన్నీ-తారక్ మధ్య అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ మూవీకి టర్నింగ్ పాయింట్

దేవరలో..

తారక్ పొన్నప్ప కన్నడలో పాపులర్ నటుడు..KHF లో కీలకపాత్ర పోషించాడు.. రీసెంట్ దేవర మూవీలో బైరా కొడుకుగా నటించాడు

బిజీ బిజీ

రీజనల్ మూవీస్ నుంచి పాన్ ఇండియా సినిమాల వరకూ బిజీగా ఉండే తారక్..మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నాడు

కొత్త విలన్

ఇప్పుడు పుష్ప 2 లో తారక్ పొన్నప్ప నటన చూసిన ప్రేక్షకులు మరో సూపర్ విలన్ దొరికాడంటున్నారు..